అఫ్గానిస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ నజీబ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. 29 ఏళ్ల నజీబుల్లా తరకాయ్ గత శుక్రవారం మార్కెట్‌కు వెళ్లాడు.. అక్కడ సరుకులు కొనుక్కుని రోడ్డు దాటుతున్నాడు.. అదే సమయంలో ఓ ప్యాసింజర్ కారు రయ్యిమంటూ దూసుకొచ్చి నజీబ్‌ను ఢీకొంది.. ఈ ప్రమాదంలో నజీబ్ తీవ్రంగా గాయపడ్డాడు.. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు నజీబ్. నజీబ్ మరణించాడన్న వార్తను అఫ్గన్ క్రికెట్ బోర్డు జీర్ణించులేకపోతున్నది.. డ్యాషింగ్ ఓపెనర్‌తో పాటు ఓ మంచి మనిషిని కోల్పోయామని బాధతో తెలిపింది క్రికెట్ బోర్డు.. 2014లో జింబాబ్వేపై తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన నజీబ్ ఆ తర్వాత టీమ్‌లో కీలకసభ్యుడయ్యాడు.. మొత్తం 24 మ్యాచులలో 47.20 సగటుతో 2030 పరుగులు చేశాడు.. అయిదు సెంచరీలతో పాటు ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు.. ఐర్లాండ్‌తో జరిగిన ఓ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన నజీబ్ అందులో అయిదు పరుగులు చేశాడు.. ఇక 12 టీ-20 మ్యాచుల్లో 258 పరుగులు చేశాడు.. ఐర్లాండ్‌తోనే జరిగిన ఓ టీ -20 మ్యాచ్‌లో మెరుపు వేగంతో 90 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు నజీబ్.. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు కూడా తీసుకున్నాడు..