చెప్పులువేసుకొని అధికారులు ఇంటిలోకి వచ్చారని ఆదివాసీల ఆగ్రహం..కొమురం భీం జిల్లాలో ఉద్రిక్తత

|

Nov 07, 2020 | 11:13 AM

తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం జిల్లాలో ఈ ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆబ్కారీ శాఖ అధికారులు అనుచితంగా వ్యవహరించారంటూ జైనూరు మండలంలో ఆదివాసీలు భగ్గుమన్నారు. చెప్పులు వేసుకొని ఇంటిలోపాలకు వచ్చారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గౌరి కోలం గూడ గ్రామంలో కోలం గిరిజన పటేల్ ఇంట్లో సోదాలు నిర్వహించే సమయంలో చెప్పులు వేసుకొని ఇంటిలోపాలకు వెళ్లారని ఆదివాసీలు అధికారులను రోడ్డుమీద అడ్డుకున్నారు. ఆబ్కారీ శాఖ అధికారిని అరెస్ట్ చేసి, విచారణ జరపాలని గ్రామ పటేల్ తోపాటు, […]

చెప్పులువేసుకొని అధికారులు ఇంటిలోకి వచ్చారని ఆదివాసీల ఆగ్రహం..కొమురం భీం జిల్లాలో ఉద్రిక్తత
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం జిల్లాలో ఈ ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆబ్కారీ శాఖ అధికారులు అనుచితంగా వ్యవహరించారంటూ జైనూరు మండలంలో ఆదివాసీలు భగ్గుమన్నారు. చెప్పులు వేసుకొని ఇంటిలోపాలకు వచ్చారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గౌరి కోలం గూడ గ్రామంలో కోలం గిరిజన పటేల్ ఇంట్లో సోదాలు నిర్వహించే సమయంలో చెప్పులు వేసుకొని ఇంటిలోపాలకు వెళ్లారని ఆదివాసీలు అధికారులను రోడ్డుమీద అడ్డుకున్నారు. ఆబ్కారీ శాఖ అధికారిని అరెస్ట్ చేసి, విచారణ జరపాలని గ్రామ పటేల్ తోపాటు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు.