కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క కీలక వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల నుండి కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగంలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ భామలు నిర్భయంగా బయటకు వచ్చి నిజానిజాలని బయట పెడుతున్నారు. ఇదివరకే కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయిన విషయం తెలిసిందే. తాను ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపుల బారిన పడ్డానని షాక్ ఇచ్చింది స్వీటీ అలియాస్ అనుష్క.
ఇటీవలే అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అనుష్క ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కూడా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడ్డట్లు వెల్లడించింది. సినీ రంగంలో ఇటువంటి వేధింపులు ఎదురవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే అని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని కెరియర్ స్టార్టింగ్‌లో తనకి కూడా ఇవి ఎదురయ్యాయని చెప్పింది. అయితే నేను స్ట్రైట్ ఫార్వార్డ్‌గా, ధైర్యంగా ఉండటం వల్ల కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని ఆమె తెలిసింది. ఇక ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వారికి ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయని చెప్పుకొచ్చింది అనుష్క.
Read More: