నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో మూవీలో హీరోయిన్ ఫైనల్ చేశారు. బాలయ్యకు జోడీగా అంజలిని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ సినిమాలోకూడా అంజలి హీరోయిన్. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ ఒక్కొక్కరూ షూటింగులు ప్రారంభిస్తుండడంతో ఈ చిత్రం యూనిట్ కూడా రెడీ అవుతోంది. ఈ నెలలోనే షెడ్యూలు హైదరాబాద్ లో మొదలవుతుందని సమాచారం. అయితే, బాలయ్య సరసన కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని బోయపాటి మొదట భావించినప్పటికీ కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఆ ఎంపిక కుదరలేదని తెలుస్తోంది.