రాజ్‌తరుణ్ సమర్పించు సందేశాత్మక చిత్రం..

| Edited By:

Aug 21, 2019 | 9:15 PM

రాష్ డ్రైవింగ్‌తో వార్తలోకెక్కిన హీరో రాజ్ తరుణ్ 24 గంటల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. హైదరాబాద్‌లోని నార్సింగ్ ప్రాంతంలో మొన్న అర్థరాత్రి సమయంలో ఓ గోడకి తన కారుని ఢీ కొట్టి.. అక్కడి నుంచి రాజ్ తరుణ్ పరారయ్యాడు. అయితే ఈ ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. యాక్సిడెంట్ జరిగిన 24 గంటల వరకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు. తప్పించుకుని తిరుగుతున్నాడన్న ప్రచారం మొదలైన తర్వాత ట్విట్టర్‌లో […]

రాజ్‌తరుణ్ సమర్పించు సందేశాత్మక చిత్రం..
Follow us on

రాష్ డ్రైవింగ్‌తో వార్తలోకెక్కిన హీరో రాజ్ తరుణ్ 24 గంటల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. హైదరాబాద్‌లోని నార్సింగ్ ప్రాంతంలో మొన్న అర్థరాత్రి సమయంలో ఓ గోడకి తన కారుని ఢీ కొట్టి.. అక్కడి నుంచి రాజ్ తరుణ్ పరారయ్యాడు. అయితే ఈ ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. యాక్సిడెంట్ జరిగిన 24 గంటల వరకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు. తప్పించుకుని తిరుగుతున్నాడన్న ప్రచారం మొదలైన తర్వాత ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకున్నాడు. ఒక సెల్పీ వీడియోను కూడా విడుదల చేశాడు. తాను కారు ప్రమాదానికి గురయ్యానని.. అయితే, దీనిపై జరిగిన ప్రచారంపై అతడు కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు వెల్లడించాడు. ప్రమాద సమయంలో తాను సీటు బెల్టు పెట్టుకోకపోయుంటే అని ఊహించుకుంటేనే భయమేస్తోందని చెప్పాడు. దయచేసి కారు నడిపేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించాడు. అలాగే బైక్‌లపై వెళ్లేవాళ్లు హెల్మెట్లు ధరించాలని రాజ్ తరుణ్ కోరాడు. ప్రస్తుతం అతడి చేతిలో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాతో పాటు మరో మూవీ ఉంది. కాని మునుపటి క్రేజ్ లేదు. మరి ఈ ప్రమాదంతో అతడి కెరియర్ కష్టాల్లో పడిందని తెలుస్తోంది.