Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో యంగ్ హీరో ట్వీట్.. ఇది తన బాధ్యత అన్న యాక్టర్

రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఈ కామెంట్స్ కాస్తా ఏపీ ప్రభుత్వం వర్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో యంగ్ హీరో ట్వీట్.. ఇది తన బాధ్యత అన్న యాక్టర్
Pawan Kalyan

Updated on: Sep 26, 2021 | 5:07 PM

రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఈ వ్యవహారం కాస్తా ఏపీ ప్రభుత్వం వర్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుతోంది. పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు. ఇప్పటికే హీరో నాని తనకు మద్దతుగా నిలిచినందుకు.. పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఏపీ సర్కార్‌ను కోరారు. తాజాగా మరో యంగ్ హీరో కార్తీకేయ కూడా పవర్ స్టార్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు.

“నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీకి మద్దతుగా నిలవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేవనెత్తిన సమస్యలు పరిగణించాల్సినవి. పరిశ్రమలోని సభ్యుడిగా మా అందరి తరుఫున మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడం నా బాధ్యత” అని కార్తికేయ పేర్కొన్నారు.

Also Read:  పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై స్పందించిన మోహన్ బాబు.. తన మార్క్ చూపించారు

షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో వచ్చి చూస్తే షాక్.. జీప్‌లో భారీ గూడు కట్టిన తేనెటీగలు