ఏసీబీ కస్టడీకి మాజీ తహశీల్దార్‌ నాగరాజు

|

Aug 25, 2020 | 9:42 AM

కీసర మాజీ తహశీల్దార్‌ నాగరాజు అవినీతి చిట్టా అంతా ఇంతా కాదు..ఇప్పటికే కీలక ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. కేసులో విచారణను వేగవంతం చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసుతో సంబంధమున్న నలుగురు నిందితులను నేటి నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.

ఏసీబీ కస్టడీకి మాజీ తహశీల్దార్‌ నాగరాజు
Follow us on

కీసర మాజీ తహశీల్దార్‌ నాగరాజు అవినీతి చిట్టా అంతా ఇంతా కాదు..ఇప్పటికే కీలక ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. కేసులో విచారణను వేగవంతం చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసుతో సంబంధమున్న నలుగురు నిందితులను నేటి నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో అవినీతి వెనకాల ఉన్న పెద్ద చేపలతోపాటు..మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందంటున్నారు.

కీసర మండల మాజీ తహసీల్దార్‌ నాగరాజు, శ్రీనాథ్‌, అంజిరెడ్డి, సాయిరాజ్‌ను మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. దీంతో చంచలగూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని.. నాంపల్లిలోని కార్యాలయంలో విచారించనున్నారు. ఈ కేసులో పట్టుబడిన కోటి పది లక్షలపై అధికారులు కూపీ లాగనున్నారు. అదే విధంగా నాగరాజు సమక్షంలో బ్యాంక్‌ లాకర్‌ను తెరవనున్నారు.

మూడు రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు, ఈ కేసులో సేకరించిన సాక్షాలను నిందితుల ముందు ఉంచి విచారిస్తారు. ఇంట్లో దొరికిన డబ్బు ఎవరిది?  కోటి పది లక్షల డబ్బు  ఎక్కడి నుంచి సమకూర్చారు?  భూ వివాదంలో కుదిరిన ఢీల్ ప్రకారం మిగిలిన 90 లక్షలు ఎక్కడ ఉంచారు? అనే పలు అంశాలపై ఆరా తీయనున్నారు.

నాగరాజు పై అధికారులను మ్యానేజ్ చేసేవాడనే అరోపణలు కూడా ఉన్నాయి. దయారా ఇన్సిడెంట్ కంటే ముందు ఇంకొన్ని విలువైన భూ వివాదాలను పరిష్కరించారనే ఆరోపణలు చేస్తున్నారు భాదితులు. కేసులో ఇప్పటి వరకు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్, విచారణలో ఏసీబీ గుర్తించిన అంశాలన్నింటిపై మూడు రోజుల కస్టడీలో వివరాలను తీసుకొనున్నారు అధికారులు.

ఇదిలావుంటే, కీసర తహశీల్దార్‌ కార్యాలయంలో 10 రోజుల్లో నలుగురు తహశీల్దార్‌లు మారారు.. ఈనెల 17 గీతను నియమించగా ఆమె విధులకు హాజరు కాలేదు. అదేరోజు సాయంత్రం గౌతం కుమార్‌ను నియమించారు. తాజాగా పలువురు తహశీల్దార్లను బదీలీ ఉత్వర్వులు జారీ చేశారు కలెక్టర్‌. దీంట్లో భాగంగా కుత్బుల్లాపూర్‌లో పనిచేస్తున్న గౌరీవత్సలను కీసర తహశీల్దార్‌గా నియమించారు.