ACB Raids on Parigi MPDO office : చక్రవర్తి అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర్నుంచి రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎంపీడీవో అడ్డంగా బుక్కయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగి ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) కార్యాలయంలో ఈ లంచాల బాగోతం బయటపడింది. పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో ఎంపీడీవో సుభాష్ గౌడ్ బ్యాచ్ మొత్తం రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. EC రఫి ,టెక్నికల్ అసిస్టెంట్ లు రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఎంపీడీవో సహా, ఆఫీస్ లోని మొత్తం 8 మంది పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీరిలో ఎంపీడీవో, ఏపీఓ, ఈసీ, ఐదుగురు టీఏలు ఉన్నారని వెల్లడించారు.