నదిలో మునిగిపోయిన ఏబీవీపీ జాతీయ కార్యదర్శి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నేషనల్ సెక్రటరీ అనికేత్ ఓహల్‌ నదిలో మునిగిపోయారు. ఆయన ఆచూకీ కోసం స్థానిక అధికారులు గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదంకు సంబంధించిన...

నదిలో మునిగిపోయిన ఏబీవీపీ జాతీయ కార్యదర్శి

Updated on: Nov 11, 2020 | 7:45 PM

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నేషనల్ సెక్రటరీ అనికేత్ ఓహల్‌ నదిలో మునిగిపోయారు. ఆయన ఆచూకీ కోసం స్థానిక అధికారులు గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదంకు సంబంధించిన వివరాలను ఏబీవీపీ నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మిలింద్ మరాఠీ తెలిపారు.

మహారాష్ట్రలోని నందర్బార్ సమీపంలోని ధడగావ్‌లో తన మిత్రులతో కలిసి ఈతకు వెళ్లినట్లుగా ఆయన వెల్లడించారు. ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా నదిలో సుడులు మొదలయ్యాయని… అయితే అతనితో నదిలోకి దిగినవారు క్షేమంగా బయటకు వచ్చారని తెలిపారు. అయితే.. అనికేత్ మాత్రం అందులో చిక్కుకొని ఉండవచ్చని తెలిపారు.

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఏబీవీపీ నిరసనల్లో అనికేత్ చురుకైన పాత్ర పోషించారు. మహారాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శిగా ఉన్న అనికేత్ రెండేళ్ళ క్రితం జాతీయ స్థాయికి పదోన్నతి పొందారు.