రోడ్డెక్కిన హైదరాబాదీల ప్రగతి రథ చక్రాలు..50 శాతం పెరిగిన సిటీ బస్సుల సంఖ్య

|

Nov 23, 2020 | 8:55 PM

hyderabad city buses  : ఒక వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి రంజుగా సాగుతోంది. మరోవైపు హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు రోడెక్కాయి. ప్రభుత్వ ఆదేశాలతో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సుల సర్వీసుల సంఖ్యను పెంచారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలతో 50 […]

రోడ్డెక్కిన హైదరాబాదీల ప్రగతి రథ చక్రాలు..50 శాతం పెరిగిన సిటీ బస్సుల సంఖ్య
Follow us on

hyderabad city buses  : ఒక వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి రంజుగా సాగుతోంది. మరోవైపు హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు రోడెక్కాయి. ప్రభుత్వ ఆదేశాలతో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సుల సర్వీసుల సంఖ్యను పెంచారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిచిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలతో 50 శాతం బస్సులు తిప్పుతున్నట్లు తెలిపిన గ్రేటర్ ఆర్టీసీ సిటీ అధికారులు వెల్లడించారు. అలాగే బస్ పాస్ కౌంటర్లను కూడా 26కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7.30 నుండి రాత్రి 8.15 వరకు బస్ పాస్ కౌంటర్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

అయితే కరోనా వైరస్‌ లాక్​డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణాలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 25 శాతం బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిందంటూ తెలంగాణ ప్రభత్వం విడుదల చేస్తున్న కోవిడ్ రిపోర్టులో వెల్లడించింది. దీంతో కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్టీసీ ఆదాయం భారీగా పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.