AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

99 ఏళ్ల వయసులో గాల్లో ఎగిరే విమానంపై నిలబడి సాహసం… ప్రపంచ రికార్డు సృష్టించిన అవ్వ!

99 ఏళ్ల వయస్సులోనూ ఒక వృద్ధురాలు గాల్లో ఎగిరే విమానం రెక్కపై నిలబడి సాహస కృత్యాలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ అద్భుతమైన స్టంట్‌తో ఆమె ప్రపంచంలోనే అత్యంత వయోధిక మహిళా వింగ్ వాకర్‌గా రికార్డు సృష్టించారు. ఈ వయస్సులో ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి కారణం ఆమె సొంత కోరిక నెరవేర్చుకోవడంతో పాటు, ఎయిర్ అంబులెన్స్ ఛారిటీ సంస్థ కోసం విరాళాలు సేకరించడమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు.

99 ఏళ్ల వయసులో గాల్లో ఎగిరే విమానంపై నిలబడి సాహసం... ప్రపంచ రికార్డు సృష్టించిన అవ్వ!
99 Year Old Woman
Jyothi Gadda
|

Updated on: Oct 17, 2026 | 8:05 PM

Share

సాధారణంగా 90 ఏళ్లు దాటిన తర్వాత నడవడానికే కర్ర సాయం వెతుక్కుంటారు. కానీ, ఒక వృద్ధురాలు మాత్రం గాల్లో దూసుకెళ్లే విమానం పైకప్పుపై నిలబడి సాహసకృత్యాలు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. జర్మనీకి చెందిన 99 ఏళ్ల హెల్గా డఫీ అనే వృద్ధురాలు గాలిలో ఎగిరే విమానం రెక్కపై నిలబడి విన్యాసాలు చేసి, ప్రపంచంలోనే అత్యంత వయోధిక మహిళా వింగ్ వాకర్ గా సరికొత్త రికార్డు సృష్టించింది.

కల నెరవేర్చుకోవడం కోసం, ఛారిటీ సహాయం కోసం:

1927 సెప్టెంబరు 23న జన్మించిన హెల్గా డఫీ, 99 సంవత్సరాల 21 రోజుల వయస్సులో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. చిన్నతనం నుంచే సాహసాలంటే ఇష్టపడే హెల్గాకు, గాల్లో ఎగిరే విమానం పైభాగంలో నిలబడి ప్రయాణించాలనే కోరిక ఉండేది. అయితే కేవలం తన వ్యక్తిగత ఆశయాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా, ఒక మంచి ఆశయం కోసం ఆమె ఈ ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎయిర్ అంబులెన్స్ ఛారిటీ సంస్థకు నిధులు సేకరించే లక్ష్యంతో ఆమె ఈ సాహసానికి శ్రీకారం చుట్టారు.

ఆకాశంలో సాహస విన్యాసం:

యుకే లోని సైరెన్‌సెస్టర్‌లో ఎరోసుపర్‌బాటిక్స్ వింగ్ వాకర్స్ బృందం సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది. విమానం భూమిపై నుంచి ఆకాశంలోకి ఎగిరినప్పుడు హెల్గా విమానం పైభాగాన ఉన్న ప్రత్యేక స్టాండ్‌కు సురక్షితంగా కట్టివేయబడ్డారు. ఆకాశంలో వేగంగా వీచే ఈదురుగాలులు, వణుకు పుట్టించే ఎత్తులోనూ ఆమె ఎలాంటి భయం లేకుండా చిరునవ్వుతో చేతులు ఊపుతూ ప్రయాణించారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ – నెటిజన్ల ప్రశంసలు:

ఈ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే క్షణాల్లో వైరల్‌గా మారింది. 99 ఏళ్ల వయస్సులో కూడా ఆమె చూపించిన నిబ్బరం, ధైర్యాన్ని చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ అవ్వ నిరూపించారు అని కొందరు కామెంట్ చేయగా, ఛారిటీ కోసం ఈ వయస్సులో అంతటి రిస్క్ తీసుకోవడం నిజంగా అభినందనీయం అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. గట్టి పట్టుదల, సమాజానికి మేలు చేయాలనే తపన ఉంటే ఏ వయసులోనైనా చరిత్ర సృష్టించవచ్చని హెల్గా డఫీ మరోసారి నిరూపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒంట్లో కొవ్వు పెరిగితే ఈ 5 ఆరోగ్య సమస్యల ముప్పు పెరగొచ్చు!
ఒంట్లో కొవ్వు పెరిగితే ఈ 5 ఆరోగ్య సమస్యల ముప్పు పెరగొచ్చు!
99 ఏళ్ల వయసులో గాల్లో ఎగిరే విమానంపై నిలబడి సాహసం!ప్రపంచ రికార్డు
99 ఏళ్ల వయసులో గాల్లో ఎగిరే విమానంపై నిలబడి సాహసం!ప్రపంచ రికార్డు
10 నిమిషాల్లో కరకరలాడే స్ట్రీట్ స్టైల్ రవ్వ  పునుగులు.. 
10 నిమిషాల్లో కరకరలాడే స్ట్రీట్ స్టైల్ రవ్వ  పునుగులు.. 
నిన్న ఒక పార్టీ లీడర్.. నేడు మరో పార్టీ చైర్మన్ అభ్యర్థి!
నిన్న ఒక పార్టీ లీడర్.. నేడు మరో పార్టీ చైర్మన్ అభ్యర్థి!
పిడికెడు తింటే చాలు.. చచ్చు బడ్డ నరాలు కూడా ఫుల్ యాక్టీవ్..
పిడికెడు తింటే చాలు.. చచ్చు బడ్డ నరాలు కూడా ఫుల్ యాక్టీవ్..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..
గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ
రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్