AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేరు గురూ..!

ఒకప్పటి ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గుర్తుందా.! క్యూట్ రోల్స్ చేస్తూనే, గ్లామరస్ గర్ల్‌గా మెరిసిన ఆమె, ఎట్ ఏ టైమ్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె ..

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..!! అస్సలు గుర్తుపట్టలేరు గురూ..!
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2026 | 7:49 PM

Share

ఒకప్పటి ఎవర్‌గ్రీన్ హీరోయిన్ గా రాణించి ఆతర్వాత కనిపించకుండా మాయమైన హీరోయిన్స్ లో సింధు తులాని ఒకరు. ఇనో సెంట్ రోల్స్‌తో ప్రారంభించి గ్లామరస్ ఇమేజ్‌తో మెరిసిన ఆమె, తన టాలెంట్ చాటుకున్న నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన సింధు, 2003లో వచ్చిన ఐతే చిత్రంతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సుల్లాన్ వంటి చిత్రాలతో అవకాశాలు సంపాదించుకుంది. శింబుతో కలిసి నటించిన మన్మధ ఆమె కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ సంచలనం సృష్టించింది ఈ సినిమా. తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతనొక్కడే మరో భారీ విజయాన్ని అందించింది. కన్నడలో రిషి, తమిళంలో అలై ఎదుకుత్తు వంటి చిత్రాలు చేసినా, ఆ ఏడాది అతనొక్కడే సినిమానే ఆమెకు అత్యంత విజయాన్ని తెచ్చిపెట్టింది. హీరోయిన్‌గా హిట్స్ కొడుతూనే మజా వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌తోనూ అభిమానులను మెప్పించింది. పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్‌తో పాటు గ్లామరస్ గర్ల్‌గా కూడా ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే క్యూట్ కుట్టీగా గుర్తింపు పొందిన సింధు, గౌతమ్ ఎస్ ఎస్ సి లో నవదీప్ సరసన హీరోయిన్‌గా నటించి కుర్రకారు క్రష్‌గా మారింది.

రొమాంటిక్ డ్రామాలతో పాటు సరదా సరదాగా, పోతే పోనీ వంటి సామాజిక అవగాహన చిత్రాల్లోనూ మెస్మరైజ్ చేసింది. పౌర్ణమిలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలర్‌ఫుల్ రోల్స్‌తో పాటు డి-గ్లామర్ క్యారెక్టర్లను కూడా పోషించి మెప్పించింది. 50 లాఖ్ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, విశాఖ ఎక్స్‌ప్రెస్లోనూ తళుక్కుమంది. మీడియం రేంజ్  బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింధు తులాని కెరీర్‌లో బతుకమ్మ ఒక మైలురాయి. గ్లామరస్ రోల్స్‌ను వదిలి ట్రాక్ మార్చి చేసిన ఈ చిత్రం ఆమెకు నటిగా స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హరే రామ్, బ్లాక్ అండ్ వైట్ వంటి చిత్రాల్లో మళ్లీ గ్లామర్‌లో కనిపించినా, బతుకమ్మ యే ఆమె కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా మిగిలింది.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోయిన్‌గా వెలిగిన తర్వాత సైడ్ రోల్స్‌లోనూ సజావుగా కనిపించిన అతి కొద్దిమంది నటీమణుల్లో ఆమె ఒకరు. పందయం, ప్రేమ కావాలి, దగ్గరగా దూరంగా, ఇష్క్, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి కెరీర్‌ను కొనసాగించింది. 2017లో చిత్రాంగద తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సింధు, 2025లో ఆంధ్రా కింగ్ తాలూకాలో ఉపేంద్ర భార్యగా తిరిగి కనిపించింది. ప్రస్తుతం ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన భర్త చేతన్ కుమార్‌తో కలిసి కుటుంబ జీవితం గడుపుతోంది ఈ అందాల తార. వీరికి ఒక కుమార్తె ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..
గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ
రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్
రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం
రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం
జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
ఇంట్లో అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసినా కరెంట్ మీటర్ తిరుగుతోందా
ఇంట్లో అన్ని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసినా కరెంట్ మీటర్ తిరుగుతోందా
మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో కూడిన ఈ విత్తనాలు పోషకాల నిధి..అద్భుత
మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో కూడిన ఈ విత్తనాలు పోషకాల నిధి..అద్భుత
పొరపాటున ఆరెంజ్ పండు గింజలను మింగితే ఏమవుతుంది..?
పొరపాటున ఆరెంజ్ పండు గింజలను మింగితే ఏమవుతుంది..?