తెలంగాణలో కరోనా కలకలం.. ఒక్క రోజే 879 పాజిటివ్ కేసులు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం

తెలంగాణలో కరోనా కలకలం.. ఒక్క రోజే 879 పాజిటివ్ కేసులు..

Edited By:

Updated on: Jun 23, 2020 | 9:12 PM

Coronavirus in Telangana: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 879 మందికి పాజిటివ్ వచ్చింది. ముగ్గురు మృతిచెందారు. తాజాగా తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 652, మేడ్చల్‌లో 112, రంగారెడ్డిలో 64, వరంగల్ రూరల్‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్ అర్బన్‌లో 9, జనగాంలో 7, నాగర్ కర్నూలులో 4, సంగారెడ్డి, మహబూబాబాద్‌లో 2 కేసుల చొప్పున, మెదక్‌లో ఒక కేసు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,109 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 3,006 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,217 మందికి నెగెటివ్ రాగా, 879 మందికి పాజిటివ్ వచ్చింది.

Also Read: గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ చాలెంజ్.. టాప్ 10లో ముగ్గురు భారతీయులు..