ఖమ్మం జిల్లా ప్ర‌జ‌ల‌కు అలెర్ట్..నేలకొండపల్లి మండ‌లంలో క‌రోనా టెర్ర‌ర్..

|

Jun 01, 2020 | 10:44 AM

తెలంగాణలో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. వలస కార్మికులు సొంతూర్ల‌కు చేరుకుటుండ‌టం, లాక్‌డౌన్ సడలింపుల నేప‌థ్యంలో జిల్లాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఆదివారం ఖమ్మం జిల్లాలో 8 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. నేలకొండపల్లి మండ‌లంలో ఓ వ్యక్తికి క‌రోనా పాజిటివ్ అని తేల‌గా.. అతడి కుటుంబ స‌భ్యుల్లో ముగ్గురికి, వారికి చెందిన‌ షాప్‌లో వ‌ర్క్ చేస్తోన్న‌ ఐదుగురికి కోవిడ్ సోకింది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ […]

ఖమ్మం జిల్లా ప్ర‌జ‌ల‌కు అలెర్ట్..నేలకొండపల్లి మండ‌లంలో క‌రోనా టెర్ర‌ర్..
Follow us on

తెలంగాణలో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. వలస కార్మికులు సొంతూర్ల‌కు చేరుకుటుండ‌టం, లాక్‌డౌన్ సడలింపుల నేప‌థ్యంలో జిల్లాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఆదివారం ఖమ్మం జిల్లాలో 8 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. నేలకొండపల్లి మండ‌లంలో ఓ వ్యక్తికి క‌రోనా పాజిటివ్ అని తేల‌గా.. అతడి కుటుంబ స‌భ్యుల్లో ముగ్గురికి, వారికి చెందిన‌ షాప్‌లో వ‌ర్క్ చేస్తోన్న‌ ఐదుగురికి కోవిడ్ సోకింది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్ర‌కటించారు. వ్యాధి సోకిన‌వారంద‌ర్నీ ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు వాక‌బు చేస్తున్నారు అధికారులు.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాక ఖమ్మం జిల్లాలో చాలా రోజుల వరకు కోవిడ్-19 కేసులు నమోదు కాలేదు. ఏప్రిల్ తొలి వారంలో పెద్ద తండాలో ఓ కేసు గుర్తించ‌గా.. తర్వాతి వారానికి జిల్లాలో క‌రోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో అల‌ర్ట‌యిన అధికారులు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇటీవ‌ల‌ వలస కార్మికులు సొంత ప్రాంతాల‌కు తిరిగి చేరుకోవ‌డం, కొన్ని లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన నేప‌థ్యంలో కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి. బస్సులో మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన మధిర మండలంలోని మహదేవపురానికి చెందిన ఓ వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అదే బస్సులో ప్ర‌యాణించిన‌ పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఇద్దరికి కరోనా సోకిన‌ట్టు తేలింది.