నిజామాబాద్‌లో మరో 8 కరోనా కేసులు.. మొత్తం పాజిటివ్ కేసులు 47..

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో గురువారం మరో 8 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా పాలనాధికారి

నిజామాబాద్‌లో మరో 8 కరోనా కేసులు.. మొత్తం పాజిటివ్ కేసులు 47..

Edited By:

Updated on: Apr 09, 2020 | 3:04 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో గురువారం మరో 8 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. దీంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 47కి చేరింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ వివరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. రేషన్‌ దుకాణాల్లో సామాజిక దూరం పాటించాలని సూచించారు.

కాగా.. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో మొదలైన కరోనా కేసుల సంఖ్య అప్పటి నుంచి కొనసాగుతోంది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న 774 మందిని గుర్తించి హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. దాదాపు 200 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక జోన్‌లు ఏర్పాటు చేశారు.