నేపాల్‌లో భారీగా హిమపాతం.. సహాయక చర్యలు ముమ్మరం!

నేపాల్ లోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం సమీపంలో హిమపాతం సంభవించింది. ఈ ప్రాంతం హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైన అన్నపూర్ణ కోసం బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉంది. ప్రకృతిపరమైన కారణాలతో పెద్ద ఎత్తున మంచు ఆకస్మికంగా విరుచుకుపడటాన్ని హిమపాతం అంటారు. దీంతో నలుగురు దక్షిణ కొరియన్లు మరియు ముగ్గురు నేపాలీ గైడ్లు తప్పిపోయారు. 150మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఈ ప్రాంతం నుండి రక్షించినట్లు అధికారులు తెలిపారు. అయితే ట్రెక్కింగ్ చేసేవారు తప్పిపోయిన ప్రధాన ప్రదేశం హిమపాతం […]

నేపాల్‌లో భారీగా హిమపాతం.. సహాయక చర్యలు ముమ్మరం!

Edited By:

Updated on: Jan 20, 2020 | 4:04 PM

నేపాల్ లోని ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం సమీపంలో హిమపాతం సంభవించింది. ఈ ప్రాంతం హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైన అన్నపూర్ణ కోసం బేస్ క్యాంప్‌కు దగ్గరగా ఉంది. ప్రకృతిపరమైన కారణాలతో పెద్ద ఎత్తున మంచు ఆకస్మికంగా విరుచుకుపడటాన్ని హిమపాతం అంటారు. దీంతో నలుగురు దక్షిణ కొరియన్లు మరియు ముగ్గురు నేపాలీ గైడ్లు తప్పిపోయారు. 150మంది దేశీయ, విదేశీ పర్యాటకులను ఈ ప్రాంతం నుండి రక్షించినట్లు అధికారులు తెలిపారు.

అయితే ట్రెక్కింగ్ చేసేవారు తప్పిపోయిన ప్రధాన ప్రదేశం హిమపాతం వల్ల మంచుతో కప్పబడినందున మేము అక్కడ హెలికాప్టర్లను ల్యాండ్ చేయలేకపోయాము అని సిమ్రిక్ ఎయిర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యోగేశ్ సప్కోటా తెలిపారు. తన సంస్థ 80 నుండి 100 మందిని రక్షించిందని, చాలామంది సమీప నగరమైన పోఖారాకు చేరుకున్నారు” అని ఆయన చెప్పారు.

సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామని, తప్పిపోయిన ఏడుగురి పరిస్థితి ఇంకా తెలియరాలేసని హెలికాప్టర్ కంపెనీలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు తెలిపాయి. వసంతఋతువు, శరదృతువు హిమాలయాలలో ట్రెక్కింగ్‌కు అనువైన సీజన్‌గా పరిగణించబడుతున్నాయి, అయినప్పటికీ, చాలా మంది విదేశీయులు శీతాకాలంలో అడ్వెంచర్ కోసం పర్వతారోహణను ఎంచుకుంటారని ట్రెక్కింగ్ కంపెనీలు చెబుతున్నాయి.