బీహార్ లో పెరుగుతోన్న క‌రోనా కేసులు..రీజ‌న్ ఇదే..

వేర్వేరు రాష్ట్రాల నుంచి బిహార్​కు తిరిగి వచ్చిన 10వేల 385మంది వలస కూలీల్లో 560మంది కోవిడ్-19 సోకింది. మే 16 వరకు నమోదైన క‌రోనా వివ‌రాలు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ 560మందిలో 172మంది ఢిల్లీ నుంచి వచ్చినట్టు పేర్కొంది. మరో 123 మంది మహారాష్ట్ర, 26మంది బెంగాల్​ నుంచి బిహార్​కు వచ్చినట్టు వివ‌రించింది. మరో 2,746మంది టెస్టుల రిజ‌ల్ట్స్ ఇంకా రాలేదని పేర్కొంది. రాష్ట్రానికి వ‌స్తోన్న‌ వలస కూలీలను క్వారంటైన్​ సెంట‌ర్స్ కు తరలిస్తున్నట్టు […]

బీహార్ లో పెరుగుతోన్న క‌రోనా కేసులు..రీజ‌న్ ఇదే..

Updated on: May 17, 2020 | 10:18 PM

వేర్వేరు రాష్ట్రాల నుంచి బిహార్​కు తిరిగి వచ్చిన 10వేల 385మంది వలస కూలీల్లో 560మంది కోవిడ్-19 సోకింది. మే 16 వరకు నమోదైన క‌రోనా వివ‌రాలు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ 560మందిలో 172మంది ఢిల్లీ నుంచి వచ్చినట్టు పేర్కొంది. మరో 123 మంది మహారాష్ట్ర, 26మంది బెంగాల్​ నుంచి బిహార్​కు వచ్చినట్టు వివ‌రించింది. మరో 2,746మంది టెస్టుల రిజ‌ల్ట్స్ ఇంకా రాలేదని పేర్కొంది. రాష్ట్రానికి వ‌స్తోన్న‌ వలస కూలీలను క్వారంటైన్​ సెంట‌ర్స్ కు తరలిస్తున్నట్టు బిహార్​ ఆరోగ్యశాఖ తెలిపింది. నిత్యం అల‌ర్ట్ గా ఉండి వైరస్​ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలిపింది.