రాజమౌళినా మజాకా… 8 నిమిషాల సీన్ కోసం ఏకంగా 55 రోజులుపాటు షూట్ చేసిన దర్శకధీరుడు..

టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశంలో ఉన్న సినీప్రేమికులంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్రలో ఎక్కడా కలవని ఇద్దరు వీరులను తెరపై కలిపి చూపుతున్నాడు జక్కన.

రాజమౌళినా మజాకా... 8 నిమిషాల సీన్ కోసం ఏకంగా 55 రోజులుపాటు షూట్ చేసిన దర్శకధీరుడు..

Updated on: Dec 18, 2020 | 7:58 PM

టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశంలో ఉన్న సినీప్రేమికులంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరిత్రలో ఎక్కడా కలవని ఇద్దరు వీరులను తెరపై కలిపి చూపించబోతున్నాడు జక్కన. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన రెండు టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. కరోనా కారణంగా  సినిమావిడుదల ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. రామోజీఫిలింసిటీలో 50 రోజులకు పైగా మెగా షెడ్యూల్ కంప్లీట్ చేశాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఒళ్లుగగుర్లు పొడిచేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శక ధీరుడు. 8 నిమిషాల నిడివి ఉన్న ఫైట్ ను షూట్ చేయడానికి రాజమౌళి 55 రోజులు తీసుకున్నాడట. ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. రాజమౌళి విషయం తెలిసిందే తాను అనుకున్న సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేంతవరకు వదిలిపెట్టడు. మరి ఈ యాక్షన్ సీన్ ఎలా ఉంటుందో చూడాలి.