ఈ ఐదేళ్ల బుడ‌త‌డు యూకేలో ఇప్పుడు పెద్ద స్టార్..ఎందుకంటే..

|

Jul 28, 2020 | 5:47 PM

భారతదేశంలో కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం ఐదేళ్ల తెలుగు బాలుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లో రూ .3.7 లక్షలు సేకరించగలిగాడు.

ఈ ఐదేళ్ల బుడ‌త‌డు యూకేలో ఇప్పుడు పెద్ద స్టార్..ఎందుకంటే..
Follow us on

భారతదేశానికి కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ ఇవ్వ‌డం కోసం ఐదేళ్ల తెలుగు బాలుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లో రూ .3.7 లక్షలు సేకరించగలిగాడు. మాంచెస్టర్ లో నివ‌శించే అనీశ్వర్ కుంచల మేలో ‘లిటిల్ పెడల్లర్స్ అనీష్ అండ్ ఫ్రెండ్స్’ అనే సైక్లింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద అనీష్, మరో 60 మంది పిల్లలతో కలిసి సైకిళ్ళపై 3,200 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించి..ఈ డొనేష‌న్స్ సేక‌రించాడు. ఇండియాకు రిలీఫ్ ఫండ్ ఇవ్వ‌డమే కాదు.. బ్రిటన్‌లో మహమ్మారిపై పోరాడ‌తున్న‌ యుకె జాతీయ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎస్) కు మద్దతుగా ఈ ఐదేళ్ల బుడ‌త‌డు క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ను కూడా ప్రారంభించాడు. అనీశ్వర్ 100 ఏళ్ల బ్రిటిష్ వ్య‌క్తి సర్ థామస్ మూర్ నుండి స్పూర్తి పొందాడని అత‌డి పేరెంట్స్ వెల్ల‌డించారు. న‌డవ‌లేని స్థితిలో ఉన్న‌ సర్ థామస్ మూర్ వైద్య సాయం అందించేందుకు ఫండ్ రైజ్ చేయ‌డం కోసం త‌న గార్డెన్ చుట్టూ స‌హాయ‌కుడి సాయంతో 100 రౌండ్లు న‌డిచార‌ట‌. ఈ చిన్న పిల్లవాడు యూకోలో ఇప్ప‌డొక‌ స్టార్ అయ్యాడు, అనేక మంది బ్రిటిష్ రాజకీయ నాయకులు అనీశ్వర్ ను క‌లిసి అత‌డి చేస్తోన్న ప‌నిని ప్ర‌శంసించారు. కాగా ఇత‌డి త‌ల్లిదండ్రులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని చిత్తూరుకి చెందిన‌వారు.