పబ్‌జీ గేమ్ తెస్తోన్న అనర్థాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా టీనేజ్ యువత ఈ గేమ్ మాయంలో పడి తమ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటుంది. కాగా ఈ ఆట కొంతమందిని బానిసల్ని చేస్తోంది. పబ్‌జీ ఆడనివ్వకపోతే ఆత్మహత్యాయత్నాలు చెయ్యడం, తల్లిదండ్రులపై దాడులకు తెగబడటం వంటి ఘటనలు అనేకం చూశారం. తాజాగా పబ్‌బీ గేమ్‌కు సంబంధించి మరో వివాదాస్పద ఘటన బయటకు వచ్చింది. పబ్‌జీ వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన మాటల యుద్ధం… చివరికి మధ్య రెండు ఫ్యామిలీల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షమ్లి జిల్లాలో జరిగింది.
జిల్లాలోని హసన్‌పుర్ గ్రామంలో.. అమన్, విశాల్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య పబ్‌జీ గేమ్‌కు సంబంధించి వాదన జరిగింది. ఇరువురి కుటుంబసభ్యులు కూడా ఇందులో జోక్యం చేసుకున్నారు. అది కాస్తా ముదిరి చివరికి ఘర్షణకు దారి తీసింది. ఇరువైపుల వారు లాఠీలు, తుపాకులతో హింసకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో గాయపడ్డ ఐదుగురిని ఆజ తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా.. ఘటనాస్థలం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్టు పేర్కొన్నారు.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!
కొవిడ్ డెడ్‌బాడీలను తీసుకెళ్లే అంబులెన్సులకు ఛార్జీలు ఫిక్స్