సెక్యూరిటీ గార్డ్ దాడిలో.. 40 మంది స్కూల్‌ విద్యార్థుల‌కు క‌త్తిపోట్లు..

| Edited By: Pardhasaradhi Peri

Jun 04, 2020 | 2:57 PM

చైనాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. కనీసం 40 మంది విద్యార్థులు, సిబ్బంది కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దాడి ఎందుకు చేశారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ సంఘటన

సెక్యూరిటీ గార్డ్ దాడిలో.. 40 మంది స్కూల్‌ విద్యార్థుల‌కు క‌త్తిపోట్లు..
Follow us on

చైనాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. కనీసం 40 మంది విద్యార్థులు, సిబ్బంది కత్తిపోట్లకు గురయ్యారు. ఈ దాడి ఎందుకు చేశారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ సంఘటన ఈ రోజు (గురువారం) ఉదయం 8.30 గంటల సమయంలో దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతంలోని వాంగ్ఫు కౌంటీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

నిందితుడిని పాఠశాలలో పనిచేసే 50 ఏళ్ల సెక్యూరిటీ గార్డు లి జియామిన్‌గా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఎనిమిది అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన బాధితులకు చికిత్స చేయడంపై అధికారులు దృష్టి సారించారని వాంగ్ఫు టౌన్‌షిప్‌ను నిర్వహించే కాంగ్వు కౌంటీ ప్రభుత్వ ప్రచార విభాగం తెలిపింది. దాడికి గురైన 40మంది పిల్లలో.. ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు కాంగ్వు ప్రభుత్వం పేర్కొంది.

2019 సెప్టెంబరులో, సెంట్రల్ చైనాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో 40 ఏళ్ల వ్యక్తి దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.

[svt-event date=”04/06/2020,2:33PM” class=”svt-cd-green” ]