కరోనా అప్డేట్స్: బెంగాల్ లో 37 కొత్త పాజిటివ్ కేసులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. కరోనా మృతులకు సంబంధించిన లెక్కలు తప్పు చెబుతున్నారంటూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న

కరోనా అప్డేట్స్: బెంగాల్ లో  37 కొత్త పాజిటివ్ కేసులు..

Edited By:

Updated on: Apr 30, 2020 | 8:17 PM

Coronavirus In West Bengal: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. కరోనా మృతులకు సంబంధించిన లెక్కలు తప్పు చెబుతున్నారంటూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో తాజా లెక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. గత 24 గంటల్లో కోవిడ్-19తో బెంగాల్‌లో 11 మంది మృత్యువాతపడగా, 37 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులు 758కి చేరుకున్నారు. మృతుల సంఖ్య 33కి పెరిగింది.

మరోవైపు.. మొత్తం కేసుల్లో 184 కరోనా పాజిటవ్ కేసులు కోల్‌కతాలో చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 1,905 కేసుల్లో శాంపిల్స్ పరీక్షకు పంపామని, ఇంతవరకూ 16.525 శాంపుల్స్ పరీక్షించడం జరిగిందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో 744 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ చెబుతుండగా, కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య 758గా ప్రకటించింది.

Also Read: కరోనా ఎఫెక్ట్: ప్రమాదంలో..160 కోట్ల మంది ఉద్యోగాలు..