బీహార్‌లో విషాదం.. 36 మంది చిన్నారులు మృతి

మెదడు వాపు వ్యాధి చిన్నారులను బలితీసుకుంటోంది. అభంశుభం తెలియని ఆ చిన్నారులు పసితనంలోనే మృత్యుఒడిని చేరుతున్నారు. బీహార్‌లోని ఆస్పత్రులన్నీ మెదడు వాపు వ్యాధి వ్యాపించిన చిన్నారులతో నిండిపోయాయి. స్కూల్‌కు వెళ్లి ఆడుకోవాల్సిన వారు మృత్యువుతో పోరాడుతున్నారు. కేవలం 48 గంటల్లో 36 మంది చిన్నారులు ఈ వ్యాధితో మృతి చెందారు. బీహార్ ముజఫర్ పూర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాగా, మరో 133 మంది పిల్లలు మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో […]

బీహార్‌లో విషాదం.. 36 మంది చిన్నారులు మృతి

Edited By:

Updated on: Jun 12, 2019 | 4:52 PM

మెదడు వాపు వ్యాధి చిన్నారులను బలితీసుకుంటోంది. అభంశుభం తెలియని ఆ చిన్నారులు పసితనంలోనే మృత్యుఒడిని చేరుతున్నారు. బీహార్‌లోని ఆస్పత్రులన్నీ మెదడు వాపు వ్యాధి వ్యాపించిన చిన్నారులతో నిండిపోయాయి. స్కూల్‌కు వెళ్లి ఆడుకోవాల్సిన వారు మృత్యువుతో పోరాడుతున్నారు. కేవలం 48 గంటల్లో 36 మంది చిన్నారులు ఈ వ్యాధితో మృతి చెందారు. బీహార్ ముజఫర్ పూర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాగా, మరో 133 మంది పిల్లలు మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చనిపోయిన వారిలో 90 శాతం మంది చిన్నారులు తీవ్రజ్వరం, బ్లడ్ లో షగర్ లెవెల్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలున్నవారేనని వైద్యులు చెబుతున్నారు. మెదడువాపు వ్యాధితో 2018 సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది మరణాల సంఖ్య అంతకు రెండు రెట్లు పెరిగింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. చిన్నారుల మరణాలపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతోనే పిల్లలు మరణిస్తున్నారని చెప్పారు. దీని పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ముజఫర్ పూర్‌లో పర్యటిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మెదడువాపు చిన్నారులకు సరైన వైద్యం అందించాలని బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.