359 కేంద్రాల్లో కరోనా పరీక్షలు.. రోజుకు 15 వేలకు పైగా టెస్టులు..

కోవిద్-19 సంక్షోభం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని జిల్లా, తాలూకా, పలు మండల కేంద్రాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది.

359 కేంద్రాల్లో కరోనా పరీక్షలు.. రోజుకు 15 వేలకు పైగా టెస్టులు..

Edited By:

Updated on: Jul 27, 2020 | 11:37 AM

కోవిద్-19 సంక్షోభం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని జిల్లా, తాలూకా, పలు మండల కేంద్రాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. మహమ్మారి వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో తక్షణ నిర్ధారణ, చికిత్స నినాదంతో ఈ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలకు అనుమతిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 359 కేంద్రాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఐసిఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబ్‌లు మరియు డయాగ్నొస్టిక్ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరీక్ష ఖర్చును 2,200 రూపాయలుగా నిర్ణయించింది. ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స ఖర్చును ప్రభుత్వం పరిమితం చేసింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలో పరీక్షలుచేసే ల్యాబ్‌లు 39 ఉన్నాయి. వీటిలో 23 ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తుండగా, 16 ల్యాబ్‌లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ 39 మినహా మిగతా 320 కేంద్రాలు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ సెంటర్స్‌ (ఆర్‌ఏటీసీ). వీటిని ప్రాంతీయ, క్లస్టర్‌ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటుచేశారు.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు.. 

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!