
ముంబైలో జూనియర్ డాక్టర్ పాయల్ తాడ్వి ఆత్మహత్యపై నిరసనలు తీవ్రమయ్యాయి. మహారాష్ట్ర గడ్చిరౌలి ప్రాంతంలోని జలగాన్ జిల్లాకు చెందిన డాక్టర్ పాయల్ తాడ్వి ముంబయిలోని బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో గైనకాలజీ పీజీ చదువుతుంది. ఎస్టీ వర్గానికి చెందిన ఈమెను తన సీనియర్లు ముగ్గురు కులం పేరుతో వేధింపులకు గురిచేశారు. తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తాడ్వి మృతికి కారణమైన వారిని శిక్షించాలని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. నాయర్ ఆస్పత్రి ముందు నిరసన తెలిపాయి. ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.