పాక్‌కు బిగ్‌ షాక్.. ప్రత్యేక దేశం దిశగా సింధ్.. రంగంలోకి సింధ్ మిలిటెంట్లు? ఇక మూడు ముక్కలవ్వడమేనా..?

| Edited By:

Jun 21, 2020 | 8:45 PM

పాకిస్థాన్‌.. మన పొరుగు దేశం.. మనం మిత్రత్వం కోరుకున్నా.. పాక్ మాత్రం ఎప్పుడు శత్రుత్వాన్నే కోరకుంటుంది. పోనీ.. ఆ దేశంలో ఉన్న వారితో సరిగ్గా వ్యవహరిస్తుందనుకుంటే అదీ ఉండదూ..? ఇప్పటికే బలూచిస్థాన్‌ ప్రాంతంలో నిత్యం ఘర్షణలే..

పాక్‌కు బిగ్‌ షాక్.. ప్రత్యేక దేశం దిశగా సింధ్.. రంగంలోకి సింధ్ మిలిటెంట్లు? ఇక మూడు ముక్కలవ్వడమేనా..?
Follow us on

పాకిస్థాన్‌.. మన పొరుగు దేశం.. మనం మిత్రత్వం కోరుకున్నా.. పాక్ మాత్రం ఎప్పుడు శత్రుత్వాన్నే కోరకుంటుంది. పోనీ.. ఆ దేశంలో ఉన్న వారితో సరిగ్గా వ్యవహరిస్తుందనుకుంటే అదీ ఉండదూ..? ఇప్పటికే బలూచిస్థాన్‌ ప్రాంతంలో నిత్యం ఘర్షణలే.. ఇప్పుడు కొద్ది రోజులుగా సింధ్ ప్రాంతంలో కూడా అలాంటి ఘర్షణలే రిపీట్ అవుతున్నాయి. దీనిని గమనిస్తే.. త్వరలో పాక్ మూడు ముక్కలు కానుందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గత శుక్రవారం జరిగిన వరుస పేలుళ్ల దాడిని చూస్తే.. దీనికి బలాన్ని చేకురుస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఉగ్రవాదులకు పుట్టినిళ్లు అయిన పాక్‌లో.. ఇటీవల బాంబ్‌ బ్లాస్ట్‌లు జరుగుతున్నాయి. మొన్న ఇస్లామాబాద్‌లో రెండు పేలుళ్లు జరగగా.. గత శుక్రవారం నాడు సింధ్ ప్రావిన్స్‌లో సింధ్ రేంజర్స్ లక్ష్యంగా దాడులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఇద్దరు రేంజర్లతో పాటు.. పలువురు స్థానికులు కూడా మరణించారు. అంతేకాదు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవర్నన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బ్లాస్ట్‌ జరిగిన కాసేపటికే.. ఆ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానితులు పట్టుబడలేదు. అయితే తాజాగా శుక్రవారం నాడు దాడికి పాల్పడింది తామేనంటూ ఓ సంస్థ ప్రకటించింది. అదే ఇప్పుడు పాక్‌ గుండెళ్లో గుబులు పుట్టిస్తోంది. ఆ సంస్థ పేరే సింధుస్థాన్‌ రెవెల్యూషన్ ఆర్మీ.

గత శుక్రవారం నాడు జరిగిన వరుస దాడులు తామే చేశామంటూ ప్రకటించింది. తొలి దాడి కరాచీ రాజధాని సింధ్‌లో తొలి పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఓ పౌరుడితో పాటు.. ఓ సైనికుడు కూడా మరణించాడు. అంతేకాదు.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు కూడా. ఇక రెండో పేలుడు ఘోట్కీ ప్రాంతంలో సింధ్ రేంజర్లు లక్ష్యంగా దాడి జరిగింది. ఇందులో ఇద్దరు రేంజర్లు మరణించారు. ఇక మూడు పేలుడు లార్కన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో మాత్రం ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం వాటిళ్లలేదు. అయితే వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే.. త్వరలో పాక్ లో ప్రత్యేక దేశాల ఏర్పాటుకు మిలిటెంట్ ఉద్యమాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.