కరోనా ఎఫెక్ట్: 4 రోజుల్లో.. 23 మంది విమాన ప్రయాణికులకు.. ‘పాజిటివ్’..

| Edited By:

May 29, 2020 | 12:05 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో

కరోనా ఎఫెక్ట్: 4 రోజుల్లో.. 23 మంది విమాన ప్రయాణికులకు.. పాజిటివ్..
Follow us on

Flight passengers test positive: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమైంది. కేవలం నాలుగురోజుల్లో దేశీయ విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది. లాక్‌డౌన్ వల్ల రెండునెలల అనంతరం దేశీయ విమాన సర్వీసులకు పౌరవిమానయాన శాఖ పచ్చజెండా ఊపింది.

వివరాల్లోకెళితే.. ఈ నెల 25 నుంచి 28వతేదీ వరకు కేవలం నాలుగురోజుల్లోనే పలు విమానాల్లో ప్రయాణించిన 23 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో కలవరం మొదలైంది. కరోనా వచ్చిన విమాన ప్రయాణికులను ఆసుపత్రుల్లోని క్వారంటైన్ కు తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రయాణించిన విమానాల్లోని ప్రయాణికులను, విమాన సిబ్బందిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు చేయించారు. వారందరినీ ముందుజాగ్రత్తగా హోం క్వారంటైన్ చేశారు.

కాగా.. విమానాల్లో కరోనా బాధితులు వెలుగుచూడటంతో పౌరవిమానయాన శాఖ అధికారులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డులు ధరించడం, విమానాలను శానిటైజ్ చేసే పనులు చేపట్టారు. మొత్తంమీద 4రోజుల్లో 23 మంది ప్రయాణికులకు కరోనా ఉందని తేలడంతో ఆయా విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికులందరినీ గుర్తించి క్వారంటైన్ చేశారు.

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..