అల్లు అర్జున్.. ఈ పేరుకు ఇప్పుడున్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం బన్నీకి అన్నీ విమర్శలే వచ్చాయి. మార్చ్ 28, 2003న గంగోత్రి సినిమాతో పరిచయమైనపుడు.. ఇతను కూడా హీరోనా అన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆర్యతో అన్ని విమర్శలకు సమాధానమిచ్చి.. వారెవ్వా.. ఏమున్నాడు కుర్రాడు అనిపించుకున్నారు అల్లు అర్జున్. బన్నీ సినిమాతో హ్యాట్రిక్ అందుకుని మార్కెట్ మరింత పెంచుకున్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత హ్యాపీ నిరాశపరిచినా.. దేశముదురుతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు. పూరీ తెరకెక్కించిన ఈ చిత్రాన్నే ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. పరుగుతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన బన్నీ.. వేదంతో డిఫెరెంట్ కథల వైపు అడుగులేసారు. జులాయితో సాలిడ్ హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.
జులాయి తర్వాత అల్లు అర్జున్ దూకుడు పెంచేసారు. మరీ ముఖ్యంగా రేసుగుర్రం తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డిజే లాంటి వరస విజయాలతో పాటు మార్కెట్ పెంచుకున్నారు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డుల్నే బద్ధలు కొట్టారు. 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. దీని తర్వాత పుష్పతో పాన్ ఇండియన్ స్టార్
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయిపోయారు అల్లు అర్జున్. ఈ సినిమాతో హిందీలోనూ సత్తా చూపించారు బన్నీ. ప్రస్తుతం పుష్ప 2తో ఏకంగా 1000 కోట్లపై కన్నేసారీయన. 20 ఏళ్ళ కెరీర్‌లో 6 ఫిల్మ్ ఫేర్స్‌తో పాటు 5 నంది అవార్డులు.. 4 సైమా అవార్డులు సొంతం చేసుకున్నారు. తనను ఇంత బాగా ఆదరించినందుకు అభిమానులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు బన్నీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..