‘ఫొని’ తుఫాను ప్రభావం… ఇద్దరి మృతి

‘ఫొని’ తుఫాను పూరీలో తీరం దాటింది… ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అధికారులు ఇప్పటికే ప్రమాద సూచికలు ఉన్న ప్రాంతాల్లోని సుమారు  11 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాంలో 3 లక్షల మందినీ, పూరీలో లక్షా 30 వేల మందిని సేఫ్ షెల్టర్లలోకి తరలించారు. బాధితుల కోసం 5,000 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 5,000 కిచెన్లు ఏర్పాటు చేసి వంటలు వండుతున్నారు. ఒడిశాలో మొత్తం […]

ఫొని తుఫాను ప్రభావం... ఇద్దరి మృతి

Edited By:

Updated on: May 03, 2019 | 2:49 PM

‘ఫొని’ తుఫాను పూరీలో తీరం దాటింది… ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అధికారులు ఇప్పటికే ప్రమాద సూచికలు ఉన్న ప్రాంతాల్లోని సుమారు  11 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాంలో 3 లక్షల మందినీ, పూరీలో లక్షా 30 వేల మందిని సేఫ్ షెల్టర్లలోకి తరలించారు. బాధితుల కోసం 5,000 షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 5,000 కిచెన్లు ఏర్పాటు చేసి వంటలు వండుతున్నారు. ఒడిశాలో మొత్తం 50 నగరాలు, 10,000 గ్రామాలపై ఫొని తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావానికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దేశం మరియు కేంద్రం సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో జరిగిన ఒక ర్యాలీలో స్పష్టం చేశారు.