19 మంది కుంభ్ మేళా భక్తులకు కరోనా పాజిటివ్, చికిత్స పొందుతూ ఆసుపత్రి నుంచి పరార్

| Edited By: Phani CH

Apr 18, 2021 | 4:33 PM

హరిద్వార్ లో జరుగుతున్న కుంభ్ మేళాకు హాజరైన రాజస్థాన్ రాష్ట్ర భక్తుల్లో 19 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. వీరందరినీ  తెహ్రీ జిల్లాలోని ఆసుపత్రిలో చేర్చారు.

19 మంది కుంభ్ మేళా భక్తులకు  కరోనా పాజిటివ్, చికిత్స పొందుతూ ఆసుపత్రి నుంచి పరార్
Rajasthan Kumbh Mela
Follow us on

హరిద్వార్ లో జరుగుతున్న కుంభ్ మేళాకు హాజరైన రాజస్థాన్ రాష్ట్ర భక్తుల్లో 19 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. వీరందరినీ  తెహ్రీ జిల్లాలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూనే వీరు నిన్న రాత్రి హాస్పిటల్ నుంచి పారిపోయారు. ఇప్పటికే కరోనా సూపర్ స్ప్రెడర్ గా పేరు పడిన కుంభ్ మేళాలో  చాలామంది ఈ వైరస్ బారిన పడ్డారు.  తాజాగా రాజస్తాన్ రాష్ట్ర భక్తుల్లో పాజిటివ్ సోకిన ఈ 19 మందీ హాస్పిటల్ నుంచి పారిపోవడం అటు హాస్పిటల్  యాజమాన్యాన్ని,  ఇటు పోలీసులను, ఆరోగ్య శాఖ అధికారులను  తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.  వీరి పరారీపై ఎఫ్ ఐ ఆర్ దాఖలైందని, తాము రాజస్తాన్ ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేశామని వారు తెలిపారు.  అసలే కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ ఈ ఘటన పట్ల అటు రాజస్తాన్ ప్రభుత్వం కూడా కలవరం వ్యక్తం చేసింది. తమ అధికారులను అప్రమత్తం చేసింది.

ప్రతి ఏటా సాధారణంగా కుంభ్ మేళా హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్ రాజ్ ప్రాంతాల్లో దాదాపు నాలుగు నెలలపాటు  జరుగుతుంది. కానీ ఈ సారి కరోనా పాండమిక్ కారణంగా ఈ మహా కార్యక్రమాన్ని30 రోజులకే కుదించారు. కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తున్న ఈ పరిస్థితుల్లో లక్షలాది యాత్రికులు, భక్తులు ఇక్కడికి వచ్చి గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడం సహజంగానే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నే  కాకుండా కేంద్రాన్ని సైతం  ఆందోళనలో ముంచెత్తింది. కుంభ్ మేళా నుంచి తిరిగి వచ్చిన భక్తులు, యాత్రికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ లో ఉండాలని, కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించాలని, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్ వంటి  రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా హెచ్ఛరికలు జారీ చేశాయి. మరోవైపు కుంభ్మేళా లో భక్తుల సంఖ్యను కుదించేలా చూడాలంటూ ఓ లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన లోగడ ఢిల్లీలో  జరిగిన తబ్లీఘీ జమాత్ ఘటనను గుర్తు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Venkatesh Drishyam 2: తెలుగు దృశ్యంను కూడా డిజిట‌ల్ స్క్రీన్‌పైనే చూపించనున్నారా.? ఓకే చెప్పేసిన నిర్మాత‌, హీరో.. ‌

KCR-Yadiyurappa Meet: కర్నాటక ముఖ్యమంత్రిని కల్వనున్న కేసీఆర్.. రాజోలిబండ సమస్యపై సీఎం ఫోకస్