ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. దేశంలో సోషల్ మీడియా వాడకం ఊహించని స్థాయికి చేరింది. అయితే ఇది కొన్ని ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. మహిళలపై మానసిక, శారీకర వేధింపులకు సోషల్ మీడియా అడ్డాగా మారింది. తాజాగా తనతో సెక్స్ చాట్ చేయాలంటూ బాలికను బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడుతోన్న యువకుడి ఉదంతం కన్యాకుమారిలో వెలుగుచూసింది. బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేస్తోన్న 17 ఏళ్ల యువకుడిని సైబర్ సెల్ పోలీసులు అదుపలోకి తీసుకున్నారు. బాలిక ఫోటోలను మార్ఫింగ్ చేసి అతడు వేధింపుల షురూ చేశాడు. ఇన్‌స్టాగ్రాంలో బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు మార్ఫింగ్ ఫోటోలను చూపి తనతో సెక్స్ చాట్ చేయాలని పలుమార్లు బెదిరించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగడంతో కామాంధుడి చేష్టలకు అడ్డుకట్ట పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలికకు పంపిన సందేశాల్లో తనతో సెక్స్ చాట్ చేయాలని నిందితుడు కోరాడు. తన మాట వినకుంటే మార్ఫింగ్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేస్తానని బెదిరించాడు. పోలీసులు నిందితుడి ఇన్‌స్టాగ్రాం అకౌంట్ వివరాల ఆధారంగా కన్యాకుమారిలో నిందితుడిని ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడిని చెన్నైలోని జువెనిల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇలాగే ప్రవర్తించగా పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారని దర్యాప్తులో తేలింది.
Also Read :