నేడే దేశవ్యాప్తంగా ‘నీట్’.. విద్యార్థులకు ముఖ్య సూచనలు

|

May 05, 2019 | 8:52 AM

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే  నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. దీనికి సంబంధించి సీబీఎస్ఈ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికిపైగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే.. ముఖ్య సూచనలు… కూలింగ్‌ గ్లాసెస్, పర్సులు, ఆభరణాలు పరీక్ష కేంద్రంలోకి […]

నేడే దేశవ్యాప్తంగా నీట్.. విద్యార్థులకు ముఖ్య సూచనలు
Follow us on

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే  నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. దీనికి సంబంధించి సీబీఎస్ఈ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికిపైగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..

ముఖ్య సూచనలు…

  • కూలింగ్‌ గ్లాసెస్, పర్సులు, ఆభరణాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.
  • ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. తలలో పువ్వులు కూడా పెట్టుకుంటే అనుమతించరు.
  • హాల్ టికెట్, ఏదైనా ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
  • మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.