ఫ్లాష్ న్యూస్: ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. తాజాగా..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఏపీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటల్లో కొత్తగా

ఫ్లాష్ న్యూస్: ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు.. తాజాగా..

Updated on: Jun 01, 2020 | 1:34 PM

Coronavirus in AP: కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. ఏపీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటల్లో కొత్తగా 104 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందినవి 76 కాగా.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 28 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

తాజాగా.. నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,118కి చేరింది. గత 24గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 64మంది మృతి చెందారు. కొత్తగా 34మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 2,169 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 885 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!

 

Loading...
Unable to load recommendations.
Follow Us