విరాట్ ఫొటోకు రూ.10 వేల ఫైన్

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:37 PM

క్రికెట్ స్టార్ హీరో విరాట్ కొహ్లీ ఫొటోను ఉపయోగించుకున్నందుకు ఓ సంస్థకు రూ.10వేల జరిమానా విధించింది కన్ జూమర్ ఫోరమ్. ప్రముఖుల ఫొటోలు, పేర్లను వారి అనుమతి లేకుండా ప్రచారంలో వినియోగించకూడదని కన్ జూమర్ ఫోరమ్ సెక్రటరీ అకున్ సబర్వాల్ తెలిపారు. హైదరాబాద్ లోని శ్రీమాన్ ఫ్యాషన్ క్లాథింగ్ సంస్థ ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఫోటోను ఉపయోగించడంపై విరాట్ అభిమాని, యూనివర్శిటీ విద్యార్థి బి.ఆకాశ్ కుమార్ కన్ జూమర్ ఫోరమ్ కు కంప్లైట్ చేశాడు. దీంతో […]

విరాట్ ఫొటోకు రూ.10 వేల ఫైన్
Follow us on

క్రికెట్ స్టార్ హీరో విరాట్ కొహ్లీ ఫొటోను ఉపయోగించుకున్నందుకు ఓ సంస్థకు రూ.10వేల జరిమానా విధించింది కన్ జూమర్ ఫోరమ్. ప్రముఖుల ఫొటోలు, పేర్లను వారి అనుమతి లేకుండా ప్రచారంలో వినియోగించకూడదని కన్ జూమర్ ఫోరమ్ సెక్రటరీ అకున్ సబర్వాల్ తెలిపారు. హైదరాబాద్ లోని శ్రీమాన్ ఫ్యాషన్ క్లాథింగ్ సంస్థ ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ ఫోటోను ఉపయోగించడంపై విరాట్ అభిమాని, యూనివర్శిటీ విద్యార్థి బి.ఆకాశ్ కుమార్ కన్ జూమర్ ఫోరమ్ కు కంప్లైట్ చేశాడు. దీంతో రంగంలోని దిగిన కన్ జూమర్ ఫోరమ్ శ్రీమాన్ సంస్థపై రూ.10వేల జరిమానా విధించంది. ఈ మొత్తాన్ని కంప్లైట్ చేసిన ఆకాశ్ కుమార్ కి ఇవ్వగా తను కన్ జూమర్ ఫోరమ్ సెక్రటరీ అకున్ సబర్వాల్ కే అందజేశారు. దీంతో ఆకాశ్ కుమార్ ను అకున్ సబర్వాల్ ఘనంగా సత్కరించారు. ఇలాంటి కేసు తమకు ఇదే రావడం మొదటిసారి అని అందరూ ఆకాశ్ కుమార్ లా నిజాయితీగా ఉండాలని పేర్కొన్నారు.