Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!

, చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!

పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల గురించి రెండు దేశాలు అధికారికంగా ప్రకటన ఇచ్చినప్పటికీ.. రాయిటర్స్ అనే న్యూస్ ఏజెన్సీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. భారత్ దాడులు జరిపిన బాలకోట్‌లోని భవనాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సంస్థ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించిన శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఓ సంస్థ తీసిన శాటిలైట్ చిత్రాలను రాయిటర్స్ ఏజెన్సీ బయటకు విడుదల చేసింది. ఆ చిత్రాలను చూస్తే బాల్‌కోట్‌ మీద బాంబులు పడ్డాయని చెప్పడానికి ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

, చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!

దీంతో భారత్ దాడులపై అందరికీ అనుమానం వచ్చేలా చేసిన ఈ ఏజెన్సీ తాజాగా దాడులు జరిగిన ప్రదేశానికి సంబంధించి మరిన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. ఈ ఫొటోలను భారత మిస్సైల్స్ కిందపడ్డ 100మీటర్ల దూరం నుంచి తీసినట్లు చెప్పుకొచ్చింది ఈ ఏజెన్సీ. బాల్‌కోట్ స్థావరాలపై దాడి జరిగిన దాఖలు అక్కడ తమకు అసలు కనిపించలేదని, కొండ మీద ఉన్న చెట్లు సహా అక్కడ భవనం చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపింది. అంతేకాదు అక్కడి స్థానికులతో కూడా తాము మాట్లాడినట్లు ఆ సంస్థ వెల్లడించింది. భారత్ దాడులు చేసినట్లు చెప్తున్న ఆ మదర్సాను గతేడాదే మూసివేశారని, ఇప్పుడు అక్కడ ఎవరూ లేరని వారు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే దాడులు జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు తమకు అనుమతిని ఇవ్వలేదని ఆ ఏజెన్సీ రిపోర్టర్ తెలిపారు.

ఇక భారత్ దాడులపై ఓ పాక్ సైనికుడు మాట్లాడుతూ.. భారత్ 300మందిని చంపాం అంటోంది. కానీ ఇక్కడ ఉన్న 300 చెట్లకు కూడా ఎలాంటి హాని జరగలేదని అన్నారు. దేవుడి దయ వలన భారత్ చేసిన దాడుల్లో బాలకోట్‌లో నివాసం ఉంటోన్న ఐదారు కుటుంబాలకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సైనికుడు చెప్పుకొచ్చినట్లు రాయిటర్స్ పేర్కొంది.

, చెక్కుచెదరని జైషే సంస్థ మదర్సా.. దాడులు నిజం కావా..!

అయితే పుల్వామాలో 42మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని ఖండిస్తూ ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 300మంది ఉగ్రవాదులు మరణించినట్లు కొందరు చెబుతున్నా.. ఇరు దేశ ప్రభుత్వాల నుంచి మాత్రం అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ క్రమంలో విడులైన శాటిలైట్ ఫొటోలు ఘటనపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ ఫొటోలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో దాడులు జరిగాయా..? జరిగితే ఎంతమంది మరణించారు..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.