5

ముంబాయి ఇండియన్స్‌కు బాలీవుడ్‌ తారల అభినందనలు

ఐపీఎల్‌ 2020 టైటిల్‌ను గెల్చుకున్న ముంబాయి ఇండియన్స్‌ టీమ్‌పై అబినందనలు వెల్లువెత్తుతున్నాయి.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ముంబాయి ఇండియన్స్

ముంబాయి ఇండియన్స్‌కు బాలీవుడ్‌ తారల అభినందనలు
Follow us

|

Updated on: Nov 11, 2020 | 12:40 PM

ఐపీఎల్‌ 2020 టైటిల్‌ను గెల్చుకున్న ముంబాయి ఇండియన్స్‌ టీమ్‌పై అబినందనలు వెల్లువెత్తుతున్నాయి.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ముంబాయి ఇండియన్స్‌ కప్‌ను గెల్చుకుంది.. ముంబాయి ఇండియన్స్‌ టైటిల్‌ గెలవడం పట్ల బాలీవుడ్‌ నటులు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌వీర్‌సింగ్‌ తెగ సంబరపడ్డారు.. రణవీర్‌ అయితే ఆ జట్టు జెర్సీని వేసుకుని తన సినిమాలోని పాటపాడుతూ డాన్స్‌ చేశాడు.. చేయడమే కాదు ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.. అమితాబ్‌బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మీర్జాపుర్‌ నటుడు అలీ ఫజల్‌ కూడా తమ ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా చెప్పారు.. ముంబాయి టైటిల్‌ గెల్చుకోవడం ఇది అయిదోసారి..