AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Qualifier 2: హైదరాబాద్ ఇంటికి.. ఢిల్లీ ఫైనల్స్‌కు..

క్వాలిఫయర్ 2లో ఢిల్లీ ఆదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.

Qualifier 2: హైదరాబాద్ ఇంటికి.. ఢిల్లీ ఫైనల్స్‌కు..
Ravi Kiran
|

Updated on: Nov 08, 2020 | 11:58 PM

Share

IPL 2020: క్వాలిఫయర్ 2లో ఢిల్లీ ఆదరగొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఆరంభంలో తడబడింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ వార్నర్(2), ప్రియం గార్గ్(17), మనీష్ పాండే(21), హోల్డర్(11) నిరాశపరిచారు.

కేన్ విలియమ్సన్(67), సమద్(33) మధ్య ఓవర్లలో మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. 19వ ఓవర్‌లో రబాడా మూడు వికెట్లు తీసి సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో రబాడా 4 వికెట్లు తీయగా.. స్టోయినిస్ మూడు వికెట్లు.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా, అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లకు 189-3 పరుగులు చేసింది. ధావన్(78), హిట్‌మెయిర్‌(42) రాణించారు. ఈ విజయంతో ఢిల్లీ ఆదివారం ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌లో తలబడనుంది.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!