IPL 2020: వివాదంలో ‘ఐపీఎల్‌ యాంథమ్’‌.. లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన రాపర్‌

| Edited By: Ravi Kiran

Sep 10, 2020 | 5:30 PM

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ పండుగ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో

IPL 2020: వివాదంలో ఐపీఎల్‌ యాంథమ్‌.. లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన రాపర్‌
Follow us on

Controversy against IPL anthem: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ పండుగ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. ఇక కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌కి సంబంధించి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే ఆయేంగే హమ్‌ వాపత్ పేరుతో ఇటీవల ఐపీఎల్‌ యాంథమ్‌ విడుదల కాగా.. ఇప్పుడు ఆ పాటపై వివాదం మొదలైంది.

ఈ యాంథమ్‌ని తన పాట నుంచి కాపీ చేశారు అంటూ కృష్ణ కౌల్‌ అనే ర్యాపర్‌ ఆరోపిస్తున్నారు. తన దేఖ్‌ కౌన్‌ అయా వాపస్ అనే తన పాట నుంచి ఐపీఎల్‌ యాంథమ్‌ని కాపీ చేశారని కృష్ణ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన అనుమతి లేకుండానే దీన్ని తీసుకున్నారని, ఎలాంటి క్రెడిట్ కూడా ఇవ్వలేదని రాపర్ ఆరోపణలు చేశారు. ఇక ఇన్‌స్టాలో దీని గురించి కామెంట్ పెట్టిన కృష్ణ.. ఐపీఎల్‌పై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటానని వివరించారు. ఆ పాటను తాను రాయలేదు, కంపోజ్ చేయలేదని, కానీ అందులోని వాయిస్ తనదేనని చెప్పుకొచ్చారు. మరి దీనిపై ఐపీఎల్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read More:

పేడలో పుట్టా.. కరోనా నా దరిదాపుకు కూడా రాదు: మంత్రి

నటికి కాంగ్రెస్ నేత క్షమాపణలు.. వివాదం ముగిసినట్లేనా!