టీమిండియాకు షాక్.. కోహ్లీకి గాయం

Indian Skipper Virat Kohli, టీమిండియాకు షాక్.. కోహ్లీకి గాయం

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడకముందే భారత్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మరో మూడు రోజుల్లో వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ప్రాక్టీస్‌లో భాగంగా విరాట్ కోహ్లీ చేతి వేలికి గాయమైందని తెలుస్తోంది. దానితో ప్రాక్టీస్ సెషన్ నుంచి అతను వైదొలిగాడట. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడా.. లేదా బ్యాటింగ్ చేస్తుండగా గాయమైందా అనేది తెలియాల్సి ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *