IMF Chief Praises India : కోవిడ్‌ని ఎదుర్కోవడంతో భారత్ పోరు అభినందనీయం.. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అప్‌డేట్‌ ఆవిష్కరణలో ప్రస్తావిస్తా: ఐఎంఎఫ్‌ చీఫ్

కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించింది. ఈ వైరస్ ఓ వైపు మరణ మృదంగం మోగిస్తూనే.. మరోవైపు ఆర్ధికంగా కోలుకొని దెబ్బతీసింది. అయితే ఈ మహమ్మారితో పాటు.. దీని వల్ల ఎదురయ్యిన ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవడంలో..

IMF Chief Praises India : కోవిడ్‌ని ఎదుర్కోవడంతో భారత్ పోరు అభినందనీయం.. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అప్‌డేట్‌ ఆవిష్కరణలో ప్రస్తావిస్తా: ఐఎంఎఫ్‌ చీఫ్
Follow us

|

Updated on: Jan 15, 2021 | 12:24 PM

IMF Chief Praises India :కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించింది. ఈ వైరస్ ఓ వైపు మరణ మృదంగం మోగిస్తూనే.. మరోవైపు ఆర్ధికంగా కోలుకొని దెబ్బతీసింది. అయితే ఈ మహమ్మారితో పాటు.. దీని వల్ల ఎదురయ్యిన ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రశంసల వర్షం కురిపించింది. ఆర్ధిక వ్యవస్థలో మార్పులకు పలు సూచనలు చేసింది.

కరోనా కాలంలోప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నామని అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో భారత్ లో సుదీర్ఘకాల లాక్ డౌన్, వ్యవసాయ చట్టాలను గురించి ప్రస్తావించారు. అంతేకాదు ప్రపంచ ఆర్థికవ్యవస్థ అప్‌డేట్‌ ఆవిష్కరణలో ప్రముఖంగా ఇదే విషయాన్ని ప్రస్తావించనున్నానని చెప్పారు. వరల్డ్‌ ఎకనమిక్‌ అప్‌డేట్‌ను జనవరి 26న విడుదల చేస్తున్నామని.. దీన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గమనించాలని అన్ని దేశాలకు క్రిస్టాలినా పిలుపునిచ్చారు.

ప్రపంచంలో అధిక జనసాంద్రత గల భారత్ లో సుదీర్ఘకాలం లాక్ డౌన్ కొనసాగించిన తీరుపై ముఖ్యంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్‌ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పనిచేశాయని తెలిపారు. అయితే, ఆర్థికవ్యవస్థను మరింత ముందుకు నడిపించడం కోసం 2021 ఏడాదిని భారత్‌ మరింత వినియోగించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లిష్టపరిస్థితుల్లో కూడా భారత్‌ చేపడుతోన్న నిర్మాణాత్మక సంస్కరణలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంస్కరణలతో మరింత ముందుకు వెళ్లాలని ఐఎంఎఫ్‌ చీఫ్‌ భారత్‌కు సూచించారు.

మరోవైపు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు వ్యవసాయ సంస్కరణల్లో ఓ ముందడుగని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభిప్రాయపడింది. వీటివల్ల మధ్యవర్తుల అవసరం లేకుండానే రైతులు నేరుగా పంటను విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపింది. అయినప్పటికీ, ఈ నూతన విధాన మార్పుల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నవారికి సామాజిక భద్రతను కల్పించాల్సిన అవసరముందని ఐఎంఎఫ్‌ స్పష్టంచేసింది.

మరోవైపు భారత్ లో కొన్ని కోట్ల మందికి కరోనా వచ్చి వారికి తెలియకుండానే తగ్గిపోయిందని తమ పరిశోధనల్లో తేలిందని థైరోకేర్ అనే డయాగ్నస్టిక్స్ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. చాలా మందిలో వాళ్లకు తెలియకుండానే కరోనావైరస్ సైలెంట్ గా ఎంటరైపోయిందని, చాలా మందికి లక్షణాలు కూడా ఉండట్లేదని చెప్పింది.

Also Read: బిగ్ బాస్ సీజన్ 4 విజేతకు టీమిండియా వైస్ కెప్టెన్ నుంచి ఊహించని బహుమతి.. గాలిలో తేలిపోతున్న అభిజిత్

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో