World Bicycle Day 2021: సైకిల్‌ ఒక మిరాకిల్‌.. ఆరోగ్యానికి మంచి సాధనం.. నేడు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం

World Bicycle Day 2021: ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ కారణం కాస్త సైకిళ్ల వాడకం తగ్గిపోయింది. సాంకేతికపరంగా ఎన్నెన్నో సౌకర్యాలు వచ్చి సైకిల్‌ వాడకం మరుగున పడిపోయింది...

World Bicycle Day 2021: సైకిల్‌ ఒక మిరాకిల్‌.. ఆరోగ్యానికి మంచి సాధనం.. నేడు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం
World Bicycle Day

Updated on: Jun 03, 2021 | 12:49 PM

World Bicycle Day 2021: ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ కారణం కాస్త సైకిళ్ల వాడకం తగ్గిపోయింది. సాంకేతికపరంగా ఎన్నెన్నో సౌకర్యాలు వచ్చి సైకిల్‌ వాడకం మరుగున పడిపోయింది. సైకిల్‌ అనేది సరళమైన, సరసమైన, పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా చెప్పవచ్చు. సైకిల్‌ అభివృద్ధికి ఒక సాధనంగా, విద్య, ఆరోగ్య సంరక్షణ క్రీడలు నిర్వహించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు ఈ సైకిల్‌ను. సైకిల్‌ వాడకం వినియోగదారుకు స్థానిక వాతావరణం గురించి తక్షణ ప్రత్యేక అవగాహన కల్పిస్తారు.

జూన్‌ 3వ తేదీన ప్రపంచ సైకిల్‌ దినోత్సవం జరుపుకొంటారు. 2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే ఓ సామాజికవేత్త ప్రచారం, తుర్క్మనిస్తాన్‌ 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రొఫెసర్‌ స్వన్సన్‌ సహకారంతో ఐజాక్‌ ఫెల్డ్‌ ప్రపంచ సైకిల్‌ దినోత్సవం కోసం లోగోను తయారు చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్ర వాహనదారులకు చిహ్నంగా ఉంది.

ప్రాముఖ్యత:

సమాజంలో సైక్లింగ్‌ సంస్కృతిని ఎంతో డెవలప్‌ చేయడానికి, ప్రోత్సహించడానికి కావాల్సిన ఉత్తమ పద్దతులను సరైన మార్గాలను అవలంబించేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రతను మెరుగుపర్చడానికి సభ్య దేశాలను ప్రోత్సహించడమే కాకుండా పాదచారుల భద్రతను కాపాడడానికి సైకిల్‌ వాడకాన్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. శారీరక శ్రమను బలోపేతం చేయడానికి.. సైకిల్‌ నేది శారీరక శ్రమను బలోపేతం చేయడానికి, వ్యాధులను నివారించేందుకు, అంతేకాకుండా సహనాన్ని ప్రోత్సహించడానికి, సామాజిక దూరాలను సులభతరం చేయడానికి సాధారణంగా సైకిల్‌ వాడకం గురించి చెప్పడమే సైకిల్‌ ముఖ్య ఉద్దేశం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజు పెరుగుతున్న నేపథ్యంలో సైకిళ్లు కొనేందుకు, సైకిళ్లపై వెళ్లేందుకు ఇప్పటికి కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. తాత, తండ్రుల నుంచి సైకిల్‌ రిపేరు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కుటుంబాలు కూడా ఇప్పటి ఉన్నాయి.

సైకిల్‌ తొక్కడం ద్వారా మంచి వ్యాయమం

ఇక సైకిల్‌ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. శారీరక వ్యాయమానికి సైకిల్‌ తొక్కడం ఎంతో మంచిది. బీపీ, మధుమోహం లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. రోజుకు ఐదారు కిలోమీటర్లు సైకిల్‌ తొక్కినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అంతేకాదు సైకిల్‌ తొక్కడం వల్ల శరీరం హుషారుగా పని చేస్తుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు పెద్దలు.

ఇవీ చదవండి

Fingernails: చేతిగోళ్లపై అర్ధచంద్రాకారం.. గోళ్లను చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..!

Follow Us