Dreams at Night: రాత్రిళ్లు కలలు ఎందుకు వస్తాయో తెలుసా? సైన్స్ ఏం చెబుతుందంటే..

|

Dec 11, 2023 | 3:07 PM

మనకు రాత్రి వేళల్లో ఎందుకు కలలు వస్తాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే చాలా తక్కువ మంది మాత్రమే సమాధానం చెబుతారు. రాత్రి నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. కానీ అసలు ఈ కలలు ఎందుకు వస్తాయి అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దీని వెనుక ఏదైనా సైన్స్ రహస్యం ఏదైనా ఉందా? అంటే.. అవునని సమాధానం చెప్పాలి. మనం రాత్రి పడుకున్న తర్వాత నుంచి ఉదయం..

Dreams at Night: రాత్రిళ్లు కలలు ఎందుకు వస్తాయో తెలుసా? సైన్స్ ఏం చెబుతుందంటే..
Dreams At Night
Follow us on

మనకు రాత్రి వేళల్లో ఎందుకు కలలు వస్తాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే చాలా తక్కువ మంది మాత్రమే సమాధానం చెబుతారు. రాత్రి నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. కానీ అసలు ఈ కలలు ఎందుకు వస్తాయి అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దీని వెనుక ఏదైనా సైన్స్ రహస్యం ఏదైనా ఉందా? అంటే.. అవునని సమాధానం చెప్పాలి. మనం రాత్రి పడుకున్న తర్వాత నుంచి ఉదయం లేచేవరకూ ఎన్నో కలలు వస్తుంటాయి. మనం పగటిపూట చూసిన దృశ్యాలు చాలా వరకు రాత్రిళ్లు కలలుగా వస్తాయి. ఒక్కోసార అవే కలలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంటాయి కూడా. నిజానికి ఇలా జరగడం వెనుక ఉన్న సైన్స్‌ ఏంటంటే..

కల అంటే ఏమిటి?

సైన్స్, సైకాలజీ ప్రకారం.. కలలకు చాలా అర్థాలు ఉన్నాయి. కానీ వాటి అర్థం తెలుసుకునే ముందు, కలలు అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ కలలు కంటారని ‘ది ఒరాకిల్ ఆఫ్ నైట్’: ‘ది హిస్టరీ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ డ్రీమ్స్’ రచయిత న్యూరో సైంటిస్ట్ ‘సిద్ధార్థ్ రిబీరో’ అంటున్నారు. రాత్రి వచ్చిన కల మేల్కోన్న తర్వాత చాలా వరకు మర్చిపోతుంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే.. గాఢ నిద్రలో మనం దాదాపు మూర్ఛ స్థితిలో ఉంటాం. ఈ దశ రాత్రి రెండవ భాగంలో సంభవిస్తుంది. ఈ కాలంలో ఎన్నో కలలు వస్తుంటాయని రిబీరో అంటున్నారు.

మెదడు రాత్రిపూట కూడా చురుకుగా ఉంటుందా?

కలలు అపస్మారక, చేతనావస్థ మనస్సు మధ్య వంతెనలా పనిచేస్తాయి. రిబీరో పరిశోధనల ప్రకారం.. ఒకటిన్నర గంట నిద్రలో సుమారు 5 కలలు వస్తాయి. మన అచేతనావస్థలోని కోరికలు, భయాల వల్ల కలలు ప్రభావితమవుతాయి. సాధారణ భాషలో చెప్పాలంటే మనిషి మెదడు రాత్రి నిద్రిస్తున్నప్పుడు కూడా చురుకుగా ఉంటుంది. దాని వల్లనే కలలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మీ కలలో ఒకే వ్యక్తి మళ్లీ మళ్లీ కనిపిస్తాడా?

మీ కలలోకి ఎవరైనా పదే పదే వస్తున్నారంటే దానికి కారణం ఆ వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడమే. మీరు ఎవరినైనా ప్రేమించినా లేదా మీరు అతనితో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నా.. ఇలా జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు మీ మనస్సులో నిలిచిపోతాయి. అదే వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు మీ మనస్సులో నిరంతరం పరిగెడుతూనే ఉంటాయి. ఆ వ్యక్తి రాత్రిళ్లు మీ కలలలోకి కూడా వస్తాడు. అదే వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం మూలంగా ఇలా జరుగుతుంది.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్‌ చేయండి.