AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: చలికాలంలో పాములు ఎందుకు మాయం అవుతాయి.. అసలు నిజాలు తెలిస్తే అవాక్కే..

వేసవి, వర్షాకాలంలో యాక్టివ్‌గా ఉండే పాములు చలికాలంలో చలికాలం రాగానే ఎక్కడికి వెళ్తాయో తెలుసా..? పాముల నిద్రాణస్థితి వెనుక ఉన్న సైన్ గురించి చాలా మందికి తెలియదు. చల్లని రక్త జీవులైన పాములు శక్తిని ఎలా ఆదా చేస్తాయి..? అవి కళ్లు తెరిచి నిద్రపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం..

Snake: చలికాలంలో పాములు ఎందుకు మాయం అవుతాయి.. అసలు నిజాలు తెలిస్తే అవాక్కే..
Why Do Snakes Disappear In Winter
Krishna S
|

Updated on: Nov 03, 2025 | 7:10 AM

Share

ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులలో ఒకటిగా పేరుపొందిన పాములు వేసవి, వర్షాకాలంలో చురుకుగా తిరుగుతూ కనిపిస్తాయి. అయితే చలికాలం రాగానే అవి అకస్మాత్తుగా అదృశ్యమవుతాయి. ఈ సమయంలో పాములు ఏం చేస్తాయి..? అవి ఎక్కడికి వెళ్తాయి..? అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఆసక్తికరంగా ఉంది.

నిద్రాణస్థితి

పాముల నిద్ర పరిసర ఉష్ణోగ్రత, ఆహార లభ్యతపై ఆధారపడి ఉంటాయి. పాములకు మనలాగా వెచ్చని రక్తం ఉండదు. వాటిని చల్లని రక్త జీవులు అంటారు. బయటి వాతావరణం చల్లగా ఉంటే, వాటి శరీరం కూడా చల్లగా మారుతుంది. వాటి శరీరం వేడిని పెంచుకోలేదు. చల్లగా ఉంటే, పాములు నెమ్మదిగా, బద్ధకంగా తయారవుతాయి. కదలడానికి శక్తి ఉండదు. ఎక్కువ శక్తిని ఖర్చు చేయకుండా ఉండటానికి..అవి నిద్రాణస్థితిని ఎంచుకుంటాయి. చలికాలం మొదలవగానే పాములు 2 నుండి 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిద్రపోతాయి. ఈ సమయంలో అవి తిండి, నీరు లేకుండా ఉండగలవు.

శీతాకాలంలో అవి ఎక్కడికి వెళ్తాయి

చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినప్పుడు, పాములు వెచ్చదనం, రక్షణ కోసం సురక్షితమైన ఆశ్రయాలను వెతుక్కుంటాయి. అవి సాధారణంగా భూమిలోపల లోతైన పగుళ్లు, పాత బొరియలు, రాళ్ల కింద లేదా చెట్ల వేర్లలో వెచ్చగా ఉండే చోట దాక్కుంటాయి. ఆశ్చర్యకరంగా.. మరింత వెచ్చగా ఉండటానికి కొన్నిసార్లు అనేక పాములు ఒకే చోట కలిసి నిద్రపోతాయి. నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు పాము శ్వాస తీసుకోవడం, హృదయ స్పందన నెమ్మదిస్తాయి. వాటి జీర్ణవ్యవస్థ కూడా పూర్తిగా నిదానిస్తుంది. వాతావరణం మారి.. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. అవి మేల్కొని మళ్లీ చురుకుగా మారుతాయి.

కళ్ళు తెరిచే నిద్ర..?

పాములు నిద్రపోవని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే వాటి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. నిజం ఏమిటంటే పాములకు కనురెప్పలు ఉండవు. వాటి కళ్ళపై దుమ్ము గాయం నుండి రక్షించే పారదర్శక పొర ఉంటుంది. అందువల్ల పాములు నిద్రపోయినప్పుడు లేదా నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు కూడా వాటి కళ్ళు తెరిచి ఉన్నట్లు కనిపిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా 3,000 పైగా పాముల జాతులు ఉండగా.. ఒక నివేదిక ప్రకారం మన దేశంలో 69 ప్రమాదకరమైన పాములు ఉన్నాయి. వాటిలో 29 సముద్ర పాములు కాగా 40 భూమిపై నివసించేవి. కింగ్ కోబ్రా, క్రైట్ వంటి పాములు భారతదేశంలో అత్యంత విషపూరితమైనవిగా చెబుతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..