ఈ పక్షి గూడు కట్టదు.. పిల్లలను పెంచదు.. బతకడానికి ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మరు..

ప్రకృతిలో పక్షుల మనుగడ కోసం అనేక రకాల వ్యూహాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి పక్షి తన గూడును తానే కట్టుకుని పిల్లలను పెంచుకుంటుంది. కానీ తన గూడును కట్టుకోకుండా, తన పిల్లల బాధ్యతను కాకికి అప్పగించే ఒక తెలివైన పక్షి ఉంది. అదే కోకిల..దీన్ని సోమరితనమా లేక మనుగడ కోసం ఇది వేసే తెలివైన వ్యూహమా? అనేది తెలుసుకుందాం..

ఈ పక్షి గూడు కట్టదు.. పిల్లలను పెంచదు.. బతకడానికి ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మరు..
Why Cuckoos Lay Eggs In Other Birds Nests

Updated on: Mar 02, 2026 | 1:05 PM

ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా పక్షులన్నీ గూళ్ళు కట్టుకోవడం, గుడ్లు పెట్టడం, పిల్లలను పొదిగి పెంచడం చేస్తాయి. కానీ ఒక పక్షి మాత్రం వీటికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. అది గూళ్ళు నిర్మించదు, తన పిల్లలను పెంచదు. ఆ పక్షే కోకిల. గూళ్లు నిర్మించకపోవడం వల్ల చాలామంది దీనిని సోమరి పక్షి అని పిలుస్తుంటారు. ఇది నిజంగా సోమరితనమా లేక మనుగడ కోసం పోరాడుతున్న తెలివైన వ్యూహమా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఆడ కోకిల తన పిల్లలను పెంచే బాధ్యతను వేరే పక్షులకు అప్పగిస్తుంది. ఇది గూళ్లు నిర్మించదు, గుడ్లను కాపాడదు లేదా పిల్లలకు ఆహారం ఇవ్వదు. ముఖ్యంగా కాకి గూడును ఎంచుకుని అది ఖాళీగా ఉన్నప్పుడు తన గుడ్లను అందులో పెడుతుంది. కాకి ఆ గుడ్లను తనవే అని భావించి, తెలియకుండానే పొదిగి పిల్లలను చేస్తుంది.

ఇది సోమరితనం కాదు.. ఒక మనుగడ వ్యూహం

శాస్త్రీయ కోణంలో చూస్తే ఇది సోమరితనం కాదు, ఇదొక అత్యంత విజయవంతమైన మనుగడ వ్యూహం. గూడు కట్టడం, పిల్లలను పెంచడం వంటి పనులు లేకపోవడం వల్ల ఆడ కోకిలకు ఇతర గూళ్ళలో ఎక్కువ గుడ్లు పెట్టడానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఆడ కోకిలలు తాము పెరిగిన అదే జాతి పక్షుల గూళ్ళను గుర్తించి, వాటిలోనే గుడ్లు పెడతాయి. కోకిల పిల్ల పుట్టగానే గూడులోని ఇతర గుడ్లను లేదా పిల్లలను బయటకు నెట్టేసి తన ఆహారాన్ని మాత్రమే పొందుతుంది. ఇది క్రూరంగా అనిపించినా, ఇదే దాని మనుగడకు మార్గం.

ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్ధతి

కోకిల మాత్రమే ఇతర తెలివైన పక్షులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తాయి. ఉత్తర అమెరికాలోని కౌబర్డ్స్, ఆఫ్రికాలోని కొన్ని పక్షులు కూడా ఇదే వ్యూహాన్ని ఉపయోగిస్తాయి. ఈ భూమిపై జీవించాలంటే ఇతర వాటికంటే భిన్నంగా ఆలోచించాల్సిందేనని కోకలి నిరూపిస్తుంది.

Follow Us