Birds Sleep: పక్షులు కిందపడకుండా చెట్లపైన ఎలా నిద్రిస్తాయి.. వాటి కాళ్ల నరాల నిర్మాణం ప్రత్యేకత ఏమిటి..?

| Edited By: Ravi Kiran

Dec 12, 2021 | 7:03 AM

Birds Sleep: పక్షులు సాధారణంగా చెట్ల కొమ్మల పైనే నిద్రిస్తాయి. పక్షులు అన్ని సమూహంగా ఉంటాయి. చీకటి పడగానే చెట్ల కొమ్మల పై వాలిపోతాయి. అన్ని ప్రాణుల్లాగే పక్షులకు..

Birds Sleep: పక్షులు కిందపడకుండా చెట్లపైన ఎలా నిద్రిస్తాయి.. వాటి కాళ్ల నరాల నిర్మాణం ప్రత్యేకత ఏమిటి..?
Follow us on

Birds Sleep: పక్షులు సాధారణంగా చెట్ల కొమ్మల పైనే నిద్రిస్తాయి. పక్షులు అన్ని సమూహంగా ఉంటాయి. చీకటి పడగానే చెట్ల కొమ్మల పై వాలిపోతాయి. అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి ఏమాత్రం కిందపడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి.

ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయి గానీ కిందపడిపోవు.

పక్షులు ఉష్ణ రక్త జీవులు. ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి. శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది

బాహ్య అస్థిపంజరంలో నాలుగు భాగాలు:

ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: కాటోర్ ఈకలు,పైలోప్లూమ్ లు, క్విల్ ఈకలు, డేన్ ఈకలు. వీటిలో ఒకే ఒక తైల గ్రంథి లేదా ప్రీన్ గ్రంథి తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి. పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం ఏర్పడుతుంది.

ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది. కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు అంటారు.

ఆహారవాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు తోడ్పడుతుంది. నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది. ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

Alcohol: మద్యం తాగిన తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి

Hindu Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా..?