
హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు.. తులసి మొక్కని చాలా మంది పెరటి గుమ్మం ఎదురుగా పెంచుకుంటారు. ఇంటి వాకిట్లో నుంచి చుస్తే పెరట్లోని తులసి మొక్క కనబడేలా చూసుకుంటారు. అలా వీలుకానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది ఇంటి బల్కానీలో పెంచుకుంటున్నారు. అలాంటి వారు తులసి మొక్కను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇంటికి బాల్కనీ ఎటువైపు ఉంటే ఆ ప్రదేశంలో వాయువ్యం వైపుగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురూ ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, తులసి మొక్కను తూర్పు దిశలో కూడా పెంచుకోవచ్చునని చెబుతున్నారు. దీంతో ఆ ఇంటిల్లిపాదికి శుభప్రదమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులలో కూడా పెంచుకోవచ్చునని చెబుతున్నారు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి తెంచరాదని చెబుతున్నారు.
ఇకపోతే, తులసిలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి. మన ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి ఆయా తులసి మొక్కలను ఏర్పాటు చేసుకోవచ్చునని చెబుతున్నారు. అంతేకాదు.. తులసి కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..