Chicks Oxygen: కోడిపిల్లలకు గుడ్డు లోపల ఆక్సిజన్‌ ఎలా అందుతుంది..? పుట్టే వరకు అందులో ఎలా జీవిస్తాయి..!

|

Feb 24, 2022 | 11:52 AM

Chicks Oxygen: మనుషులలాగే ఏదైనా జీవి జీవించడానికి ఆక్సిజన్ అవసరం. మానవులు, పక్షులు, జంతువులు ఆక్సిజన్ లేకుండా జీవించడం సాధ్యం కాదు. అయితే జీవులు పుట్టక..

Chicks Oxygen: కోడిపిల్లలకు గుడ్డు లోపల ఆక్సిజన్‌ ఎలా అందుతుంది..? పుట్టే వరకు అందులో ఎలా జీవిస్తాయి..!
Follow us on

Chicks Oxygen: మనుషులలాగే ఏదైనా జీవి జీవించడానికి ఆక్సిజన్ అవసరం. మానవులు, పక్షులు, జంతువులు ఆక్సిజన్ లేకుండా జీవించడం సాధ్యం కాదు. అయితే జీవులు పుట్టక ముందు ఎలా ఊపిరి పీల్చుకుంటాయి? మానవ శిశువులు కడుపులో పెరుగుతారు. కానీ పక్షుల సందర్భంలో కోడిపిల్లలు (Chicks) గుడ్డు లోపల ఎలా ఊపిరి పీల్చుకుంటాయో అనే విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. గుడ్డు (Egg) పూర్తిగా ప్యాక్ చేసినట్లు ఉంటుంది. మరి అలాంటి సమయంలో కోడిపిల్లలకు ఆక్సిజన్ ఎలా చేరుతుంది? గుడ్డు పూర్తిగా ప్యాక్‌ చేసినట్లు ఉన్నా.. అందులో పెరిగే పిల్లలకు ఆక్సిజన్‌ (Oxygen) అందుతుంది. గుడ్డు కింద మనకు సాధారణంగా కనిపించని ఒక రకమైన పొర ఉంటుంది. ఈ పొరల మధ్య ఒక చిన్న గాలి కణం ఉంటుంది. దాని లోపల ఆక్సిజన్‌తో నిండి ఉంటుంది. దాని వల్ల అందులో ఉన్న పిల్లలకు ఇలాగే ఆక్సిజన్‌ అందుతుంది. ఇది ప్రతి పక్షి గుడ్డులో ఇలాగే జరుగుతుంది.

కోడి గుడ్డు పెంకులో 7,000 కంటే ఎక్కువ రంధ్రాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ ఆ రంధ్రాలు కనిపించవు. ఇది సూక్ష్మంగా ఉండటం వల్లనే గమనించలేము. మీరు భూతద్దం సహాయంతో గుడ్డును చూస్తే దానిలో ఈ చిన్న రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ చిన్న రంధ్రాల ద్వారా ఆక్సిజన్ గుడ్డు లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ కూడా ఈ రంధ్రాల నుండి బయటకు వస్తుంది. అంతే కాదు ఈ కణాలు కోడిపిల్లకు నీటిని అందించడంతో కూడా సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి:

Meditation: ధ్యానం చేసే సమయంలో శరీరంలో ఏం జరుగుతుంది..? ఎలాంటి మార్పులుంటాయి.. పరిశోధనలో కీలక విషయాలు

Watermelon: సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. పుచ్చకాయతో అదిరిపోయే ప్రయోజనాలు