Focus on Fat Loss: శరీరం బరువు తగ్గడానికి.. కొవ్వు తగ్గడానికి తేడా ఏమిటి..? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..!

|

Feb 18, 2021 | 5:32 PM

బరువు తగ్గాలని లేదా కొవ్వు తగ్గాలని గత కొంతకాలంగా వింటున్న మాటలు. నిజానికి ఈ రెండు పదాలకు అర్ధం విభిన్నం. శరీరంలో బరువు తగ్గడం అంటే కొవ్వు, కండరాలతో పాటు నీటి బరువుతో సహా ఒక వ్యక్తి యొక్క ...

Focus on Fat Loss:  శరీరం బరువు తగ్గడానికి.. కొవ్వు తగ్గడానికి తేడా ఏమిటి..? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..!
Follow us on

బరువు- కొవ్వు రెండింటి మధ్య వ్యత్యాసం : బరువు తగ్గాలని లేదా కొవ్వు తగ్గాలని గత కొంతకాలంగా వింటున్న మాటలు. నిజానికి ఈ రెండు పదాలకు అర్ధం విభిన్నం. శరీరంలో బరువు తగ్గడం అంటే కొవ్వు, కండరాలతో పాటు నీటి బరువుతో సహా ఒక వ్యక్తి యొక్క మొత్తం తగ్గితే బరువు తగ్గడం అంటాం.. అదే కొవ్వు తగ్గడం అంటే ప్రాథమికంగా శరీరం నుండి కొవ్వును మాత్రమే కోల్పోతోంది. ఈ ఫలితాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. కాని మనం వాటిని పోల్చినప్పుడు.. కొవ్వు తగ్గడం బరువు తగ్గడం కంటే చాలా మంచిదిగా భావిస్తారు. ఈరోజు కొవ్వు తగ్గడానికి, బరువు తగ్గడానికి గల తేడా ను తెలుసుకుందాం..!

శరీరం బరువు లేదా కొవ్వును తగ్గడానికి గల తేడాలు:

ఎవరైనా బరువు తగ్గడాన్ని చాలా ఈజీగా లెక్కించవచ్చు. వెయింగ్ మెషిన్ తో మనం ఎంత బరువు ఉన్నామో సులభంగా తెలుసుకోవచ్చు. ఐతే ఇది మీరు కోల్పోయిన బరువును మాత్రమే తెలియజేస్తుంది. కొవ్వుని కాదు.. అయితే శరీరంలో కొవ్వు ఎంత ఉంది కొలవడానికి ఖచ్చితమైన పరికరం అంటూ ఏదీ లేదు. కనుక శరీరంలో కొవ్వు శాతాన్ని కొలవడం కొంచెం కష్టం.

బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడం ఎందుకు మంచిది:

మన శరీరంలో బరువు తగ్గడం కంటే కొవ్వు తగ్గడం మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఎక్కువుగా బరువు కోల్పోడానికి చాలా పద్ధతులు సూచిస్తున్నారు. డైట్ కంట్రోల్ తో బరువు తగ్గిస్తున్నారు. వాస్తవానికి అన్ని అనారోగ్య సమస్యలకు కారణమయ్యే కొవ్వు తగ్గడం అన్నింటికీ మంచిది. శరీరంలో అనవసరమైన కొవ్వు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణంగా నిలుస్తుంది. దీంతో కొవ్వు కరిగితే అనేక వ్యాధులను నిర్ములించుకోవచ్చు. కొవ్వు తగ్గితే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. కనుక శరీరం బరువును తగ్గించుకోవడం కంటే.. కొవ్వు శాతాన్ని తగ్గించుకుంటే అనేక వ్యాధులను నివారించుకోవచ్చు

శరీరానికి ప్రోటీన్లు అవసరం ఎందుకంటే :

కొవ్వు ఆరోగ్యానికి చెడ్డది.. ఎవరైనా బరువు తగ్గినప్పుడు, శరీరంలోని కొవ్వు అంతా కండర ద్రవ్యరాశితో భర్తీ చేయబడుతుంది. ఇది శరీరం ఆరోగ్యం , రూపాన్ని మెరుగుపరుస్తుంది. కనుక ఎప్పుడూ బరువు తగ్గడం పైనే కాదు కొవ్వును తగ్గించుకోవడానికి పెట్టాలి. ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే కొవ్వు కరుగుతుంది. ప్రోటీన్లు జీవితాన్ని పునర్మిస్తాయి. మన శరీరంలోని ప్రతి కణం ప్రోటీన్‌తో తయారవుతుంది. కనుక ఎవరైనా తినే ఆహారంలో పిండిపదార్ధాలను, కొవ్వును పెంచే ఆహార పదార్ధాలను తగ్గించినప్పుడు కండర ద్రవ్యరాశి పనితీరు మెరుగు పరచడానికి ప్రోటీన్లు ఆహారంగా తీసుకోవాలి

కొవ్వు ను తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులు: 

శారీరక వ్యాయామాలు ఎక్కువ కొవ్వు ను కోల్పోవడానికి సహాయపడుతుంది. అంతేకాదు కండర ద్రవ్యరాశి పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. శరీరం తీరుగా కనిపిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. దీంతో ఎక్కువ కేలరీలను తగ్గించుకుంటారు. అయితే ఈపద్ధతి జరిగే మార్పు మన శరీరానికి మంచి కాదు. కనుక బరువు తగ్గడం కంటే అనవసరమైన కొవ్వును కరిగించుకోవడానికి ప్రయత్నించడండి. ప్రణాళికాబద్ధమైన ఆహారాన్ని నియమాలను అనుసరిస్తూ ఆరోగ్యంగా ఉండండి.

Also Read:

 పొట్ట తగ్గించుకునేందుకు ప్రయాత్నిస్తున్నారా ? ఈ 5 రకాల జీరో కేలరీలున్న ఫుడ్ తింటే రిజల్ట్ పక్కా..

పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో వర్షం కురవడం దేనికి సూచన అంటే..