అబ్బాయి మెడలో.. అమ్మాయి తాళి కడితే తప్పేంటి..?

పెళ్లంటే ... పేదంటి తండ్రికి మోయలేనంత భారం... డబ్బుకు కొదువ లేని శ్రీమంతులకు చెప్పలేనంత ఆడంబరం... పెళ్లికి ముందు చేసుకునే సంబరాలకే ఈ దేశంలో వేల కోట్ల ఖర్చు పెట్టే శ్రీమంతులున్నారన్న విషయం.. నిన్న గాక మొన్నే అంబానీలింట వేడుకలతో యావత్ ప్రపంచానికి అర్థమయ్యింది. అయితే అందుకు పూర్తిగా విరుద్ధమైన సంఘటనలకు ఈ దేశంలో ఏ మాత్రం కొదువలేదన్నది కూడా జగమెరిగిన సత్యం.

అబ్బాయి మెడలో.. అమ్మాయి తాళి కడితే తప్పేంటి..?
అమ్మాయిలు కూడా అబ్బాయిలకు తాళి కట్టే పెళ్లి
Image Credit source: TV9 Network

Edited By: TV9 Telugu

Updated on: Jun 19, 2024 | 12:13 PM

పెళ్లి… భారమా.. బరువా..మీలో తాపీ ధర్మారావు రాసిన పెళ్లి.. దాని పుట్టు పూర్వోత్తరాలు ఎంత మంది చదివారు..? చదివి అర్థం చేసుకునే వారి దృష్టిలో పెళ్లి అంటే… ఒక అర్థం… అదే ఇటీవల కాలంలో యూట్యూబులో వస్తున్న ప్రవచనాల సారాంశాన్ని మెదడులోకి పూర్తిగా ఎక్కించుకొని అప్పుడప్పుడు ఆ విజ్ఞాన ప్రదర్శనను చేసే వ్యక్తుల దృష్టిలో మరో అర్థం. పెళ్లంటే … పేదంటి తండ్రికి మోయలేనంత భారం…డబ్బుకు కొదువ లేని శ్రీమంతులకు చెప్పలేనంత ఆడంబరం… పెళ్లికి ముందు చేసుకునే సంబరాలకే ఈ దేశంలో వేల కోట్ల ఖర్చు పెట్టే శ్రీమంతులున్నారన్న విషయం.. నిన్న గాక మొన్నే అంబానీలింట వేడుకలతో యావత్ ప్రపంచానికి అర్థమయ్యింది. అయితే అందుకు పూర్తిగా విరుద్ధమైన సంఘటనలకు ఈ దేశంలో ఏ మాత్రం కొదువలేదన్నది కూడా జగమెరిగిన సత్యం. పెళ్లంటే.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. ఇవి మాత్రమే ఉంటే ఈ కాలం దాన్ని పెళ్లి అనుకోదు.. అందుకే రాజప్రసాదాల్లా కల్యాణ మంటపాలు సిద్ధమైపోయాయి.  వేల కోట్లు కాకపోయినా… తాహతు అనే ఒక అర్థం తెలియని అబద్ధాన్ని నిజమని భ్రమపడిపోయి… ఉన్నదంతా ఖర్చు పెట్టే తల్లిదండ్రులకు.. ఇప్పుడు ఏ మాత్రం లోటు లేనే లేదు. అయితే ఇన్ని వింతలు జరుగుతున్న ఈ కాలంలో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు… పాత వాసనలు చవి చూస్తుంటాం… వందల ఏళ్ల ఆచారమంటూ… ఇప్పటికీ పాటించే ఆనాటి అలవాట్లు కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతాం. ప్రతి మూడేళ్లకు మాత్రమే సాధారణంగా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి