
వర్షాకాలం సీజన్ మొదలైంది.. దేశ వ్యాప్తంగా అప్పుడే వానలు దంచికొడుతున్నాయి. అయితే, వానలు, వరదల కారణంగా పొదలు, చెట్లల్లో దాగివున్న పాములు, కీటకాలు జనావాసాల్లోకి వచ్చి చేరుతుంటాయి. తరచూ పాములు ఇళ్లలోకి దూరి జనాల్ని భయపెడుతున్న ఘటనలు కూడా అనేకం మనం చూశాం. ఈ క్రమంలోనే చాలామందికి నాగుపాములు కూడా దారి వెంట వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ పాములు చాలా ప్రమాదకరం. కొంతమంది నాగుపాములను చూసి ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. ఇవి ఒక్కసారి దాడి చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని పాముల కంటే నాగు పాముల విషం చాలా ప్రమాదకరం. అందుకే చాలామంది వీటికి దూరంగా ఉంటారు.
నాగుపాములు గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు కనిపించడం లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే, నాగుపాములకు దగ్గరగా వెళ్లినప్పుడు అది పడకవిపడం గమనించే ఉంటారు.. నిజానికి నాగుపాము పడగ ఎందుకు విప్పుతుందో మీకు తెలుసా..? నాగుపాములు అడగ విప్పడానికి అనేక కారణాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. నాగుపాములు వాటికున్న పడగలను హుడ్ అని కూడా అంటారు. ఇవి ఇతరులను బెదిరించడానికి మాత్రమే విప్పుతాయట.
అంతేకాకుండా ఈ నాగుపాములు భయంకరంగా కనిపించేందుకు వాటి పొడవైన పక్కటెముకలను విస్తరించి పడగలను విప్పుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాగుపాములు ఎక్కువగా పడగవిప్పడవిప్పడానికి కారణాలు శత్రువులను భయపెట్టడానికేనని అనేక పరిశోధనల ద్వారా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నాగుపాములు పడగ విప్పింది అంటే ఇక అది తప్పకుండా దాడి చేస్తుందని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పడగ విప్పిన పాముకు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..